Kavitha Protest For Women's Reservation Bill Live Updates: ఢిల్లీలో దీక్ష విరమించిన కవిత, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షకు సంబంధించిన న్యూస్ కోసం ఎప్పటికప్పుడు ఈ పేజ్‌అప్‌డేట్ అవుతుంది. రిఫ్రెష్ చేయండి!
LIVE
Background
Kavitha Protest For Women's Reservation Bill Live Updates: పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు. ఒక్కరోజు దీక్షకు వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు కవిత దీక్షకు మద్దతు తెలపనున్నాయి.
భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఉదయం పది గంటలకు దీక్షను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షలో కవిత కూర్చుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సీపీఐ కార్యదర్శి డీ రాజా వచ్చి దీక్షను విరమింపజేస్తారు.
కవితతోపాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, భారత జాగృతి సమితి సభ్యులు దీక్షలో పాల్గొంటారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు వచ్చి ఆమెకు సంఘీభావం తెలపనున్నారు. ఇప్పటికే కవిత దీక్షకు సుమారు 30 పార్టీల వరకు మద్దతు తెలిపాయి. వీరితోపాటు మహిళా హక్కుల సంఘాలు, మహిళా స్వచ్ఛంద సంస్థలు, పార్టీల లీడర్లు వచ్చి సంఘీభావం ప్రకటించనున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కవిత తలపెట్టిన పై గురువారం సాయంత్రం వరకు సస్పెన్స్ నెలకొంది. కవిత దీక్ష టైంలోనే బీజేపీ కూడా ధర్నా చేస్తామని చెప్పడంతో అసలు ఎవరి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇస్తారనే టెన్షన్ క్రియేట్ అయింది. చివరకు జంతర్‌మంతర్ నుంచి ధర్నా వేదికను దీన్‌దయాల్ మార్గ్‌కు బీజేపీ మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర దీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు కవిత. దేశవ్యాప్తంగా ఉన్న 29 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నట్లు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నామని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2న పోస్టర్ రిలీజ్ చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు ముందుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే దేశం ఎలా విశ్వగురు అవుతుందని ప్రశ్నించారు. లోక్‌సభలో బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, ఆ పార్టీ తలచుకొంటే ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకొని బిల్లు తేవచ్చని చెప్పారు. : దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో 14.4 శాతం మాత్రమే మహిళా ప్రతినిధులు ఉన్నారన్న కవిత.. పక్కనున్న పాకిస్థాన్‌లో 17 శాతం ఉన్నారని.. మహిళా రిజర్వేషన్లే సమస్యకు పరిష్కారమంటున్నారు. దాదాపుగా ఐదు వేల మంది ఈ మహిలా రిజర్వేషన్ల నిరసన దీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో దీక్ష విరమించిన కవిత, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష సాయంత్రం ముగిసింది. ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన కల్వకుంట్ల కవిత దీక్ష ముగిసింది. మోదీ సర్కార్ తల్చుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని కవిత అన్నారు. తన దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత.
దిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష, మహిళా బిల్లు కోసం పోరాడతామని స్పష్టం
దిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని కవిత తెలిపారు.
కవితకు ఆప్ మద్దతు- ఎంపీల సంఘీభావం
చట్టసభల్లో మహిళలకు సాధికారత కల్పించడంపై కేంద్రం హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆప్ ఎంపీ సంజయ్. కవిత దీక్షకు ఆమె మద్దతు తెలిపారు.
Empowering women in the legislative discourse must be guaranteed particularly by the Government.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 10, 2023
I thank Rajya Sabha MP @SanjayAzadSln and @AamAadmiParty for extending their support to this protest. https://t.co/aopWMy0AKj pic.twitter.com/6kujsMWPFD
కవిత నిరహార దీక్షకు సీతారాం ఏచూరి మద్దతు
మహిళా రిజర్వేషన్ కోసం కవిత చేస్తున్న దీక్షకు వివిధ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు.
దీక్ష ప్రాంగణం వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేపట్టబోతున్న దీక్ష ప్రాంగణం వద్దకు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు.