News
News
X

Jubilee Hills Gang Rape Case: బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: ఇన్నోవా కారులో వీర్య నమూనాలు! అతణ్ని కూడా ఏ-6 గా చేర్చుతారా?

Jubilee Hills Gang Rape Case Updates: నిందితులు వాడిన కార్లలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేయగా, మెర్సిడిస్ బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి.

FOLLOW US: 
Share:

Jubilee Hills Gang Rape: హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నగరం నడి మధ్యలో సాయంత్రం వేళ జరిగిన ఘటనలో నిందితులు అంతా రాజకీయ నాయకుల వారసులు ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈ కేసును పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు నిందితులను (ముగ్గురు మైనర్ల, ఒక మేజర్) అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌​కు పంపారు. ఈ కేసు విచారణ అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ ఉన్నారు. మరో నిందితుడు ఉమర్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు తరలిస్తారు.

ఇన్నోవా కారులో వీర్య అవశేషాలు
ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు ఉపయోగించిన కార్లలో ఒకటి ఇన్నోవా కారు. మరో బెంజి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేయగా, మెర్సిడిస్ బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాధిత బాలిక జుట్టు, చెప్పు, కమ్మను క్లూస్‌ టీమ్‌ నిపుణులు గుర్తించారు. ఇన్నోవా కారులోనూ బాలిక జుట్టుతో పాటు నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు. వాటిని సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పోలీసులు పంపించారు. అయితే, ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకు పాత్ర కూడా ఉందని వాదనలు వస్తున్నాయి. కానీ, అతనికి సంబంధం లేదని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. కానీ, అతను ఎమ్మెల్యే కొడుకే అని బీజేపీ నేతలు నొక్కి చెబుతున్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికలు వస్తే అసలు విషయం తేలనుంది. అదే నిజమైతే ఎమ్మెల్యే కొడుకు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఏ-6గా పెట్టే అవకాశం ఉంది.

ఇన్నోవాను ఫాం హౌస్‌లో దాచి, తలదాచుకున్న నిందితులు
మే 28న బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు అత్యాచారం అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్ లో తలదాచుకున్నారు. ఆ ఇన్నోవా కారును కూడా అక్కడే దాచి ఉంచి, దానికి ఉన్న ప్రభుత్వ వాహన స్టిక్కర్, ఎమ్మెల్యే స్టిక్కర్ ను తొలగించారని సమాచారం. తర్వాత అక్కడి నుంచి తలో దిక్కుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఫాంహౌస్​ యజమాని అయిన రాజకీయ నేతను ప్రశ్నిస్తున్నారు.

మే 28న పబ్ లో మద్యం రహిత పార్టీ
గత మే నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక అమ్నేషియా పబ్ లో 28న మధ్యాహ్నం విద్యార్థులు గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్నారు. విద్యార్ధులు సాయంత్రం 5 గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే పబ్ లోనే 17 ఏళ్ల మైనర్ బాలికను ఆరుగురు యువకులు ఎరుపు రంగు బెర్సిడిస్ బెంజ్ కారులో తీసుకెళ్లారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి వారు 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక, వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్దకు మళ్లీ వచ్చి బాలికను వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో బాధితురాలి తండ్రి ఆలస్యంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తొలుత భావించిన పోలీసులు, అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పడంతో సెక్షన్లు మార్చి విచారణ మొదలుపెట్టారు.

Published at : 06 Jun 2022 07:55 AM (IST) Tags: Innova car Jubilee Hills Gang Rape Girl Gang Rape Case Forensic Experts Jubilee Hills girl incident jubilee hills pub incident

సంబంధిత కథనాలు

Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం

Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది