By: ABP Desam | Updated at : 18 Sep 2021 08:01 AM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
కెనడాలో తన భర్త తనను వదిలి ఒక్కమాట కూడా చెప్పకుండా వదిలి వెళ్లిపోయాడని హైదరాబాద్ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను 2 నెలల గర్భవతి అని.. ఆరోగ్యం సరిగా లేదని ఆవేదనగా ట్వీట్ చేసింది. ఇప్పటి వరకూ తన భర్త ఎక్కడున్నాడనేది తెలియదు తెలిపింది. అయితే ఈ విషయంపై భారత హై కమిషన్ కు ఆగస్టు 20,2021న ఫిర్యాదు చేసినా.. ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి జైశంకర్ కు ట్వీట్ చేసింది.
'నా పేరు దీప్తి.. నేను మాంట్రియల్ కు మూడు నెలల క్రితం వచ్చాను. నా భర్త ఇక్కడే పని చేస్తారు. ఆయన నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆగస్టు 9వ తేదీన ఇండియాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నా భర్త, అతడి కుటుంబ సభ్యులతో నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఆయన కుటుంబ సభ్యులందరూ నా ఫోన్ నెంబర్ ను బ్లాక్ లీస్టులో పెట్టారు. నేను రెండు నెలల గర్భవతిని నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ప్రయణాలు చేసే పరిస్థితిలో లేను.
నా భర్త తమ్ముడు హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తన్నాడు. నా భర్త, అత్తామామలను అతడే దాచి పెడుతున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యం గురించి భయంగా ఉంది. నా మానసిక స్థితి నన్ను చంపేస్తుంది. దయచేసి నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు నాకు సాయం చేయండి. ' అంటూ కెనడాలోని భారత హైకమిషన్ కు దీప్తి ఫిర్యాదు చేశారు. తన భర్తకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చారు.
అయితే భారత హైకమిషన్ కు దీప్తి చేసిన కంప్లైంట్ ను విదేశీ వ్యవహారాల శాఖకు పంపారు. ఆ మహిళ భర్తకు సంబంధించిన వివరాలను కూడా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి దీప్తి చేసిన కంప్లైంట్ పై ఎలాంటి పురోగతి లేదు. ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతున్నా.. ఎలాంటి పురోగతి లేదని.. బాధితురాలు .. మళ్లీ.. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలిపింది. కేంద్రమంత్రి జైశంకర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
దీప్తి ట్వీట్ ను చూసిన... రాచకొండ పోలీసులు స్పందించారు. అత్యవసరంగా ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. దీప్తీ తల్లిదండ్రులు తరఫు బంధువులు ఎవరైనా ఉంటే.. రాచకొండ సీపీని కలవొచ్చని ట్వీట్ చేశారు.
@Chaitanyapurips @meerpetps @YacharamPS @DCPLBNagar @AcpLbNagar @sheteams_rck urgent enquiry and report. If any relatives of Deepti Reddy in Hyderabad from her parents side they can meet CP Rachakonda on 18 th September at 1230 pm at Neradmat office, Vayupuri colony.
— Rachakonda Police (@RachakondaCop) September 17, 2021
Also Read: Nellore Crime: గొంతులో బఠాణీ ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి.. కంటతడి పెట్టిస్తున్న ఘటన
Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క
TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!
Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల
Minister Vemula Prashanth Reddy : కేసీఆర్ ను కట్టడి చేయాలని కవితపై కేసుల వేధింపులు- మంత్రి వేముల
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!