అన్వేషించండి

Chandrayanagutta: బంగ్లా యువతి హైదరాబాద్‌లో వ్యభిచారం! ఆ గొడవతో అడ్డంగా బుక్!

Chandrayanagutta: యువతిని ఇద్దరు దంపతులు చేరదీసి వారు ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. దంపతులకు, యువతికి మధ్య గొడవ రావడంతో విషయం బట్టబయలు అయింది.

Bangladesh girl in Hyderabad: బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి హైదరాబాద్ కు వచ్చి వ్యభిచారం చేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె దాదాపు 2 నెలల క్రితం నగరానికి వచ్చి ఈ పని చేస్తోందని అనుమానిస్తున్నారు. ఈ యువతిని ఇద్దరు దంపతులు చేరదీసి వారు ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. దంపతులకు, యువతికి మధ్య గొడవ రావడంతో విషయం బట్టబయలు అయింది. స్థానికులు, పోలీసుల జోక్యంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఘాజి మిల్లత్‌ కాలనీలో షేక్‌ సోనియా (27), మహ్మద్‌ సల్మాన్‌ (24) భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఇతను ఓ గార్మెంట్స్ షోరూంలో పని చేస్తుండగా.. షేక్‌ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. షేక్ సోనియా బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ, భారత్‌కు చెందిన పురుషుడికి పుట్టారు. దీంతో కోల్‌కతాలో షేక్‌ సోనియాకు బంధువులు ఉన్నారు. అయితే, బంగ్లాదేశ్‌, మియన్మార్‌ వాసులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ ఉండడంతో అందులో ఆమె తరచూ చాటింగ్ చేస్తుండేదని పోలీసులు గుర్తించారు.

అలా ఆమెకు బంగ్లాదేశ్ లోని రాయ్‌పూర్‌ గ్రామానికి చెందిన స్రిస్టీ అక్తర్‌ అనే 22 ఏళ్ల యువతి పరిచయం అయింది. అలా ఉపాధి కోసం ఆరా తీయడంతో.. వ్యభిచార వృత్తి గురించి చెప్పింది. నెలకు రూ.20 వేలు వస్తాయని షేక్‌ సోనియా చెప్పగా.. డబ్బు కోసం తాను సరే అని చెప్పింది. అలా రెండు నెలల క్రితం బంగ్లా యువతి స్రిస్టీ అక్తర్‌ దేశ సరిహద్దులు దాటి అక్రమంగా కోల్‌కతాకు చేరింది. అక్కడి నుంచి రైలులో సికింద్రాబాద్‌కు వచ్చి షేక్‌ సోనియాకు ఫోన్‌ చేయగా.. వారు చేరదీశారు. 

వారికి ఉన్న పరిచయాలతో ఆమెతో వ్యభిచారం చేయించడం స్టార్ట్ చేశారు. ఎక్కడ ఎవరు పిలిచినా బంగ్లా యువతిని షేక్ సోనియానే తీసుకెళ్లి తీసుకువచ్చేది. అలా ఓసారి ఆ దంపతులకు తెలియకుండా ఓ కస్టమర్ దగ్గరికి వెళ్లడంతో.. ఈ దంపతులు ఆమెను వెంబడించారు. అత్తాపూర్‌లో ఆమెను పట్టుకున్నారు. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని ఫోన్ ను లాక్కొని డయల్‌ 100కు ఫోన్ చేయగా అత్తాపూర్‌ పోలీసులు అక్కడికి వచ్చారు. అసలు విషయం తెలుసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. 

పోలీసులు దంపతులైన సోనియా, మహ్మద్ సల్మాన్ తో పాటు యువతిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్రిస్టీ అక్తర్‌కు బంగ్లాదేశ్‌లో భర్త ఆసిఫ్‌ఖాన్‌, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget