Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాఫిక్ అలర్ట్ - శ్రీరామనవమి శోభాయాత్రతో ఆ ప్రాంతాలకు నో ఎంట్రీ
Hyderabad Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు.
Hyderabad Traffic Restrictions: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వివరించారు.
సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభం
శ్రీరాముడి శోభాయాత్ర మొత్తం 6 కిలో మీటర్ల మేర కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభం అవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) March 29, 2023
Commuters, please make note of traffic restrictions/diversions in view of #SriRamaNavami on 30th March, 2023. #SriRamaNavami2023 #TrafficAlert #TrafficAdvisory @AddlCPTrfHyd pic.twitter.com/E2Kqb2f0e4
ఈ క్రమంలోనే యాత్ర సాగనున్న మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహకరించాలని ప్రయాణికులను కోరారు. అలాగే హైదారాబాద్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రయాణం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.
90 రోజుల పాటు ఎర్రగడ్డలో రోడ్డు మూసివేత
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. మెట్రో స్టేషన్ వద్ద ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 28వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్ అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
కూకట్ పల్లి నుంచి బేగంపేట వైపు ట్రాఫిక్ మళ్లింపు
కూకట్ పల్లి నుంచి అమీర్ పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్ పల్లి మెట్రో స్టేషన్ యూటర్న్ వద్ద లెఫ్ట్ టర్న్ ఔడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాప్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పార్వత్ నగర్, టోడీ కాంపౌండ్ వైపు మళ్లించనున్నారు. ఇక కూకట్ పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్ ను కూకట్ పల్లి వై జంక్షన్, బాలా నగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్ పల్లి జంక్షన్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లైఓవర్ వద్ద మళ్లించనున్నారు. బాలానగర్ నుంచి కూటక్ పల్లి వై జంక్షన్ మీదగా అమీర్ పేట వైపు వెళ్లే వాహనాలను బాలా నగర్ ఫ్లైఓవర్ కింద న్యూ బోయిన్ పల్లి జంక్షన్, తాడ్ బండ్ రైట్ టర్న్, ప్యారడైస్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ వైపు మళ్లించనున్నారు. అలాగే మూసాపేట, గూడ్ షెడ్ రోడ్డు నుంచి అమీర్ పేట వైపు వచ్చే ట్రాఫిక్ ను ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, పార్వత్ నగర్, టోడీ కాపౌండ్, కావూరి హిల్స్ వైపు మళ్లిస్తారు.