By: ABP Desam | Updated at : 03 Jun 2023 09:41 PM (IST)
జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత, పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Closure of Ikea flyover on 4 June: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూన్ 4న ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు ఉంది. దుర్గం చెరువు వంతెన వద్ద డ్రోన్ షో నిర్వహిస్తున్న క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ఐకియా ఫ్లై ఓవర్ తాత్కాలికంగా మూసివేతతో జూన్ 4 సాయంత్రం 4 గంటల నుంచి జూన్ 5న ఉదయం 6 కింది ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
21 రోజుల పాటు జరిగే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్ 22న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో ముగియనున్నాయి. పల్లెలు, పట్టణాలు, పాఠశాలల్లో అంతటా ప్రజలు అమరవీరులకు నివాళులర్పించి, మౌనం పాటిస్తారు. నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఐకియా ఫ్లై ఓవర్ మూసివేతతో ట్రాఫిక్ మళ్లింపులు..
బయో డైవర్సిటీ, టీ-హబ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ - సైబర్ టవర్స్ - రైట్ టర్న్ - COD జంక్షన్ - నీరూస్ జంక్షన్ - జూబ్లీ హిల్స్ వద్ద మళ్లించనున్నారు.
ఏఐజీ హాస్పిటల్ నుంచి కేబుల్ వంతెన (Cable Bridge) మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ - ఎడమ మలుపు - సైబర్ టవర్స్ - కుడి మలుపు - COD జంక్షన్ - నీరు జంక్షన్ - జూబ్లీహిల్స్ వద్ద మళ్లింపులు..
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద మళ్లిస్తారు. IKEA ఫ్లై ఓవర్ ఆ నిర్దేశిత సమయంలో మూసివేయనున్నారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) June 3, 2023
Commuters are requested to note the #TrafficRestrictions / #Trafficdiversions in view of #SurakshaDinotsavam celebrated as a part of #TelanganaRashtraAvatarana #DashabdiUtsavalu. TS Police Organizing #FootMarch from #MJMarket to #Charminar on 4th June, 2023 at 1000 PM. pic.twitter.com/xD8CzAq2kf
హైదరాబాద్ లో ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం (ఈ 4న) రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంజీవయ్య పార్కు నుంచి చార్మినార్ వరకు పెట్రోల్ కార్/ బ్లూ కోల్ట్స్ ర్యాలీ వెళ్లి తిరిగి అదే రూట్‌లో వస్తారు. సంజీవయ్య పార్కు, బుద్దభవన్, షెయిలింగ్ క్లబ్, చిల్డ్రన్స్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం, అబిడ్స్, ఎంజే మార్కెట్, సిద్ది అంబర్ బజార్, అఫ్జల్‌గంజ్, నయాపూల్, మదీనా, పత్తర్‌ఘట్టి, గుల్జార్‌హౌస్, ఛత్రినాక, చార్మినార్ వరకు ఈ ర్యాలీ వెళ్లి కొనసాగుతోంది. కనుక ఆయా జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు.
- ట్యాంక్‌బండ్‌పై ఇరువైపులా, PVNR మార్గ్, బుద్ద భవన్, నల్లగుట్ట, ఇందిరా గాంధీ రోటరీ రూట్లలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రాఫిక్ మళ్లింపులు.
- సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై టీఎస్ ఉమెన్ పోలీస్ సేఫ్టీ వింగ్ కార్నివాల్ జరుగుతుంది. ఈ సమయంలో ట్యాంక్‌బండ్ పై వాహనాలను అనుమతించరు.
- ఆదివారం రాత్రి 10 నుంచి 11 గంటల వరకు ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు పుట్ మార్చ్ నిర్వహిస్తారు. దాంతో ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు.
- బీఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్ద ట్రాఫిక్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ మరికొన్ని అంశాలపై ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు
Breaking News Live Telugu Updates: చంద్రబాబుకు ఎల్లుండి వరకు జ్యుడీషియల్ కస్టడీ: జడ్జి
Hyderabad News: వైఎస్ సహాయకుడు సూరీడుపై హైదరాబాద్‌లో కేసు - పోలీసులపై కూడా అభియోగాలు
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
Singareni Jobs: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి, ఆ తీర్పు రద్దు
Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్
Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?
Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ
Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ
/body>