అన్వేషించండి

Hyderabad Traffic: ఎవరి ఒత్తిడికి లొంగం, తాగి దొరికితే జైలు తప్పదు - ABPతో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌

Hyderabad New Year News: నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులతో మర్యాదగా ఉండాలి. ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ కొందరు కాలర్ పట్టుకుంటారు..షర్టు గుంజేస్తారు.మిషన్ పగలగొడతారు.

Hyderabad Traffic Rules on December 31st: నూతన సంవత్సర వేడుకల్లో ఇష్టమొచ్చినట్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్. వాహనాలు ఆపితే కొందరు పోలీసులపైనే దాడులు చేస్తున్నారని.. తాగి నడుపుతూ దొరికిపోయి కూడా పోలీసులపై రివర్స్ లో రెచ్చిపోతున్నారని అన్నారు. అలా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసారి హైదరాబాద్ నగరంలో ప్రత్యేక నిఘా ఉండబోతోందంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తో ABP దేశం ముఖాముఖి...

ప్రశ్న: ఈ రోజు నగరంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎటువంటి ఆంక్షలు ఉంటాయి?

న్యూ ఇయర్ పార్టీల సందర్భంగా నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపేవారితో పాటు ఇతర ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. ఈసారి మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకునేందు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సిటీ వ్యాప్తంగా 120 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతోపాటు, రాత్రి 9గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలు పెడుతున్నాం. పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారిని అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు. మద్యం తాగేవారు, తాగండి, కానీ తాగిన తరువాత వాహనాలు నడిపేందుకు మాత్రం మద్యం తాగనివారి సహాయం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారు సంయమనం పాటించాలి. ఈ రోజు రాత్రి బేగంపేట, లంగర్ హౌస్ తప్ప అన్ని ఫ్లై ఓవర్స్ క్లోజ్ లో ఉంటాయి. చాలా మంది బైక్ లపై స్టంట్స్ చేస్తుంటారు. న్యూఇయర్ రివలరీ అంటూ హంగామా చేస్తుంటారు. అలాంటి  వాళ్లను పట్టుకుంటాం. సీసీటీవీ కెమెరాల నిఘాలో గుర్తించడంతోపాటు, వారిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తాం. 

ప్రశ్న: మద్యం ఎంత మోతాదులో తీసుకుంటే వాహనం నడపవచ్చు?

మద్యం తాగినవాళ్లు వాహనం నడపకూడదు అనేది మా విజ్జప్తి. అవగాహన కోసం చెప్పాలంటే 100మిల్లీ గ్రాముల రక్తంలో 30మిల్లీ గ్రాముల ఆక్కాహాల్ పర్సంటేజ్ దాటితే వారిపై కేసు నమోదు చేస్తాం. ఆల్కోమీటర్ ద్వారా శ్వాస తీసుకున్నప్పడు 30మిల్లీ గ్రాములు దాటకుండా ఉంటే వాళ్లపై కేసులు నమోదు చేయము. అయితే ఎంత మోతాదులో మద్యం తాగితే ఆ పరిధి దాటదనేది మా పరిధిలో అంశంకాదు. మద్యం తాగినవారు వాహనం నడిపేందుకు ప్రైవేటు డ్రైవర్లను పెట్టుకోవచ్చు లేదా మాకు కాల్ చేయొచ్చు. ప్రైవేటు ఆటో, టాక్సీలు బుక్ చేసుకుని వెళ్లొచ్చు.

ప్రశ్న: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఏంచేస్తారు..?

ఆల్కహాల్ పర్సంటేజ్ నిర్దారించుకున్న తరువాత వారిపై కేసు బుక్ చేస్తాం. వారు నడుపుతున్న వాహనం సీజ్ చేసి సంతకం తీసుకుంటాం. వేరే వాహనంలోలేదా బంధువులకు కాల్ చేసి వారిని ఇంటికి పంపుతాం. ఇక్కడ ఇబ్బంది పెట్టేవిధంగా దురుసుగా వ్యవహరించం. గౌరవంగా ఇంటికి వెళ్లేలా చేస్తాం. కోర్టు నుంచి సమన్లు అందిన తరువాత కేసులో జరిమానా, లేదా శిక్ష అనేది ఆల్కహాల్ పర్సంటేజ్, ఎన్నోసారి పట్టుబడ్డారు అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న: చాలా మంది మద్యం తాగి పట్టుబడ్డవారు నానా హంగామా చేస్తారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తారు? ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు?

నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులతో మర్యాదగా ఉండాలి. ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ కొందరు కాలర్ పట్టుకుంటారు.. షర్టు గుంజేస్తారు. మిషన్ పగలగొడతారు. ఆ సమయంలో పోలీసులు సహనం కోల్పోకుండా ఉంటారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినవారు తప్పించుకోవడం అసాధ్యం. ప్రతిది వీడియో రికార్ట్ అవుతుంది. బ్రీత్ అనలైజర్ డేటా రికార్డ్ అవుతుంది. మా సర్వర్ కు లింక్ అవుతుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుంది. కాబట్టి ఎవరీ ఒత్తిడి మాపై పనిచేయదు. మద్యం సేవించి దొరికితే జైలుకు వెళ్లక తప్పదు.

ప్రశ్న: పబ్ యజమాన్యాలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు?

పబ్ లకు మైనర్లను అనుమతించకూడదని ఇప్పటికే నగరంలో అన్ని పబ్స్ యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పబ్ లో ఎక్కడా డార్క్ ఏరియా ఉండకూడదు. అన్ కవర్డ్ ఏరియా ఉండకూడదు. అప్పటికే మద్యం సేవించి పబ్ లోపలికి వచ్చే వారిని అనుమతించకూడదు. అలాంటి వారికి మళ్లీ తాగించకూడదు. మహిళల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటిపంచాలి. ఎవరైనా మద్యం సేవించి వారి కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే మాకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే చెప్పడం జరిగింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget