By: ABP Desam | Updated at : 09 May 2023 09:57 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఉగ్రవాదుల కదలికల్లో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడ్డ వారు ది కేరళ స్టోరీ సినిమా తరహాలో మతమార్పిడి చేయించుకున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల నివసిస్తున్న వారిని మొత్తం ఐదుగురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు కలిసి ఆపరేషన్ నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీ హెచ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గా పని చేస్తున్న మహ్మద్ సలీమ్, ఎంఎన్‌సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్, పాతబస్తీలో దంత వైద్యుడిగా పనిచేస్తున్న షేక్ జునైద్, రోజువారీ కూలీలు మహ్మద్ అబ్బాస్, హమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రోజువారీ కూలీ మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితుల నుంచి ఎయిర్‌పిస్టల్స్, పెల్లెట్స్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వారంతా గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులంతా మారుపేర్లతో చెలామణి అవుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన మరో 11 మంది ఉగ్రవాదులతో కలిసి ఈ ఆరుగురు కాంటాక్ట్ లో ఉన్నట్లుగా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మతమార్పిడి చేసుకున్నట్టు కూడా బయటికి వచ్చింది. నిందితుడు మహ్మద్ సలీం పాత పేరు సౌరభ్‌రాజ్ వైద్య, అబ్దుల్ రహమాన్ పాత పేరు దేవీ ప్రసాద్, మహ్మద్ అబ్బాస్ పాత పేరు వేణు కుమార్ అని పోలీసులు గుర్తించారు. అయితే, నిందితులు పేర్లు మార్చుకున్నారా? మతం మార్చుకున్నారా? అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో భోపాల్‌లో 11 మందిని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. తాజాగా పట్టుబడ్డ వారిని ప్రశ్నించడం ద్వారా మరికొంత సమాచారం రాబట్టేందుకు అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేఖంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ.. కామెంట్స్ పెడుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా దేశంలో ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నాయన్న అనుమానంతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
టెర్రర్ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా
ప్రస్తుతం జంట నగరాల్లో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన వారంతా భోపాల్ నుంచి వచ్చిన వారేనని భావిస్తున్నారు. షెల్టర్ కోసమో లేకపోతే.. ఎవరి దృష్టి పడకుండా ఉండటానికో హైదరాబాద్ వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని భద్రతా సంస్థలు అనుకోవడం లేదు. పూర్తి స్ధాయిలో నిఘా పెడుతున్నాయి. అంతర్గత భద్రత విషయంలో కేంద్రం ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు.
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్