అన్వేషించండి

MLAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బండి సంజయ్ అనుచరుడిపై ప్రశ్నల వర్షం! కీలక ఆధారం వెలుగులోకి

సింహయాజితో శ్రీనివాస్ కు ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేయించిన వ్యక్తులు ఎవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతూ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడిగా ఆరోపణలు వినిపిస్తున్న అడ్వకేట్ శ్రీనివాస్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ జరుపుతున్నారు. సోమవారం (నవంబరు 21) శ్రీనివాస్ ను సిట్ అధికారులు ఐదు గంటలుగా విచారణ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్న సింహయాజి స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశారని శ్రీనివాస్ పై ఆరోపణలు వస్తున్నాయి. అక్టోబర్ 26 న తిరుపతి నుండి హైదరాబాద్ కు సింహయాజి స్వామికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సిట్ అధికారులు సేకరించారు.

ఈ ఆధారాల నేపథ్యంలో సింహయాజితో శ్రీనివాస్ కు ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ తో సింహయాజికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించిన వ్యక్తులు ఎవరన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ లిస్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధారాలను ముందు ఉంచి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు బీఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్ హాజరు కాలేదు.

సుప్రీంకోర్టులో టీఆర్ఎస్‌కు ఊరట

మరోవైపు, ఇదే కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తి వేసింది. సింగిల్ జడ్ది పర్యవేక్షణ, సిట్ విచారణ నిలిపి వేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేసింది. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. సిట్ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్ పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తి వేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్నాసనం ఆదేశించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌ను మిగతా ముగ్గురు విచారణకు రాలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ సహా నలుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ వైద్యుడు జగ్గుస్వామి, కేరళలోని భారత్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్‌, కరీంనగర్‌ న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ విచారణకు పిలిచింది. 41ఏ సీఆర్పీసీ నోటీసులు అందజేసింది. ఈ రూల్స్ ప్రకారం నోటీసులు అందుకుంటే కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. 

అరెస్టులు వద్దన్న హైకోర్టు

సిట్ విచారణపై హైకోర్టుకు వెళ్లిన బీజేపీకి నిరాశే ఎదురైంది. జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను సైతం హైకోర్టు విచారించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని హైకోర్టుకు తెలపగా.. కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాలని సిట్ కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Upcoming Cars Bikes in November: నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!
నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Embed widget