Hyderabad Traffic: రేపు హైదరాబాద్‌లో ఈ రూట్స్ క్లోజ్, ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
ట్రాఫిక్ డైవర్షన్స్ తో పాటు ఆ కార్యక్రమానికి హాజరయ్యే వారు వెహికల్స్ పార్కింగ్ చేసుకొనేలా వివరాలను వెల్లడిస్తూ నగర ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు శనివారం (జూన్ 10) ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు.
![Hyderabad Traffic: రేపు హైదరాబాద్‌లో ఈ రూట్స్ క్లోజ్, ట్రాఫిక్ మళ్లింపులు ఇలా Hyderabad police traffic diversions due to formation day celebrations on Necklace road Hyderabad Traffic: రేపు హైదరాబాద్‌లో ఈ రూట్స్ క్లోజ్, ట్రాఫిక్ మళ్లింపులు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/27ec5d15196b55ba442bd082081338911686455081355234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Traffic Diversions in Hyderabad: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు (Telangana Formation Day Celebrations) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం (జూన్ 12) ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో కొన్ని కార్యక్రమాలు జరగనున్నాయి. వాటి నిర్వహణ కోసం పోలీసులు ఆ దిశలో మార్గాలను మూసివేయనున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ తెలంగాణ రన్ నిర్వహించనున్నారు. ఈ రన్ లో పోలీస్ సిబ్బందితో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొననున్నారు. అందుకే సోమవారం (జూన్ 12) ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ఈ మళ్లింపులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) కోరారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ తో (Traffic Diversions) పాటు ఆ కార్యక్రమానికి హాజరయ్యే వారు వెహికల్స్ పార్కింగ్ చేసుకొనేలా వివరాలను వెల్లడిస్తూ నగర ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు శనివారం (జూన్ 10) ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అఫ్జల్ గంజ్ – సికింద్రాబాద్ మధ్య నడిచే చేసే ఆర్టీసీ బస్సులను తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ రూట్లలోకి మళ్లించనున్నారు.
వీఐపీల వెహికల్ పార్కింగ్ కోసం ఐమాక్స్ వద్ద, ఎంప్లాయీస్ కోసం కార్ రేసింగ్ రోడ్ దగ్గర, ఇతర వెహికల్స్ ను జలవిహార్ వరకు సింగిల్ లేన్ పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా (Traffic Diversions)
ఖైరతాబాద్ (Khairatabad) లోని విశ్వేశ్వరయ్య స్టాట్యూ, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ రూట్లలో సోమవారం (జూన్ 12) తెల్లవారు జాము నుంచి ట్రాఫిక్ ను అనుమతించరు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోడ్ కు వచ్చే వాహనాలను షాదాన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా దారి మళ్లించనున్నారు. నిరంకారీ భవన్, చింతలబస్తీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ ను అనుమతించబోరు.
ఖైరతాబాద్ బడా గణేశ్ (Khairatabad Ganesh) నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోడ్ వైపు (Neclace Road) వెళ్లే వాహనాలను రాజ్ దూత్ లేన్ నుంచి మళ్లించనున్నారు. బుద్ధభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ ను రాణిగంజ్ నుంచి దారి మళ్లించనున్నారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, రాణిగంజ్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను తెలుగుతల్లి జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ మీదుగా అనుమతించకుండా.. వాటిని తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా దారి మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి జంక్షన్, బీఆర్కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లలో వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ ను ఇక్బాల్ మినార్ జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)