Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు, ఆయన మంచి కోసమే
Goshamahal MLA Raja Singh | తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును వినియోగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు

Hyderabad police issues notice to BJP MLA Raja Singh life threat
హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ప్రాణాలకు త్రెట్ ఉండడం, భద్రతా కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రత సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగించుకోవాల ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు సూచించారు. ఈ మేరకు ఆదివారం (జూన్ 1న) సాయంత్రం మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ రాజా సింగ్ కు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా mla రాజాసింగ్ ఒంటరిగా తిరగవద్దు అని , ప్రభుత్వం ఇస్తున్న భద్రత సిబ్బందిని వినియోగించుకోవాలని నోటీసులలో పేర్కొన్నారు.
ఒక్క ఆవును కోసినా ఊరుకునేది లేదన్న రాజా సింగ్
బక్రీద్ పండుగ సందర్భంగా ఒక్క ఆవు, ఎద్దు, దూడను కోసినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం, కానీ ఆవుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బక్రీద్ పండుగకు ముందుగానే ఆవులు, ఎద్దులను సిద్ధం చేస్తున్నారని.. వాటిని చంపడం పాపం అన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాజాసింగ్ విజ్ఞప్లి చేశారు.
కొన్ని ఏరియాలలో బైకు మీద తిరుగుతూ గోవధ జరపడానికి సిద్ధంగా ఉంచిన ఆవులు అని, వాటిని కాపాడాలని రాజా సింగ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గోమాత ప్రేమికులు అని, ఈ బక్రీద్ సందర్భంగా గోవధను అడ్డుకోవాలని కోరారు. సిటీలోకి ఆవులు, దూడలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని.. లేకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని రాజా సింగ్ అన్నారు. ఓల్డ్ సిటీలో ఆవు, దూడలు, ఎద్దులను రోడ్డుపై పెట్టి విక్రయిస్తున్నారని ఆరోపించారు. అసలే ఆయన ప్రాణాలకు ముప్పు ఉండటం, మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది లేకుండా.. బుల్లెట్ ప్రూఫ్ కారు వాడకుండా బయట తిరుగుతున్నారని గుర్తించిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు, సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించుకోవాలని నోటీసులలో పోలీసులు సూచించారు. కాగా, బక్రీద్ సందర్భంగా గోవులు, ఎద్దులను వాహనాలలో తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ జితేందర్ ఇదివరకే హెచ్చరించారు.






















