Hyderabad : హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు రెండు పరిష్కారాలు! ప్యారడైజ్ టు సమీర్‌పేట వరకు రెండు ఎలివేటెడ్ ప్రతిపాదనలు సిద్ధం!
Hyderabad : హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి అధికారులు రెండు ప్రతిపాదనను రెడీ చేశారు.

Hyderabad Lest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు గురించి ఎంత చెప్పినా తక్కువే. మెట్రో రన్ అవుతున్నా, ఎక్కడిక్కక్కడ ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ ట్రాఫిక్ చిక్కులు నగరవాసులకు తప్పడం లేదు. ముఖ్యంగా నార్త్ సిటీ వైపు పరిస్థితి మరింత హారిబుల్‌గా ఉంటుంది. అందుకే దీనికి పరిష్కారంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్యారడైజ్ కూడలి నుంచి సమీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
హైదరాబాద్ రోజురోజుకు చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ విస్తరణ కారణంగా శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే దీని నుంచి ఉపశమనం కోసం మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించారు. కానీ అది ముందుకు కదలడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నార్త్‌సిటీపై ఎక్కువ ఫోకస్ చేశారు. ప్యారడైజ్ సర్కిలల్ నుంచి మేడ్చల్, సమీర్‌పేట వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ మార్గం కేలం నిత్యం ప్రయాణించే లోకల్ వాహనాలే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాణిజ్య వాహనాలకు కూడా ప్రధాన రహదారి. దీంతో సాధారణ ప్రయాణ సమయం అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మార్గంలో ఉదయం, సాయంత్ర వేళల్లో ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందింగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌లు, వర్షాలు పడితే సమస్యలు మరింత రెట్టింపు అవుతున్నాయి.
వీటికి పరిష్కార మార్గంగానే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని అధికారులు ప్రణాళికలలు సిద్ధం చేశారు. ఈ కారిడార్ ద్వారా నగరంలోలని అంతర్గత ట్రాఫిక్‌ను, ప్రధాన మార్గ ట్రాఫిక్‌ను వేరు చేయవచ్చు. దీని వల్ల నిరంతరాయంగా, వేగవంతైన ప్రయాణాన్ని సాధించవచ్చు. రవాణా సామర్థ్యాన్ని పెంచడం, తద్వార ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికే ప్యారడైజ్ నుంచి సమీర్‌పేట వరకు ఈ కారిడర్‌ను ప్రతిపాదించారు. సాధారణంగా ఒక పెద్ద నిర్మాణ ప్రాజెక్టును చేపట్టే ముందు, సంబంధిత ఇంజినీరింగ్ విభాగం లేదా కన్సల్టెన్సీ సంస్థలు ప్రాజెక్టు డిజైన్, నిర్మాణ వ్యయం, సాంకేతిక అంశాలు, పర్యావరణ ప్రభావం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్మాణ వ్యయం, నిర్మాణ సమయం, ఇంజినీరింగ్, ఆర్థికపరమైన వివరాలతో వీటిని రెడీ చేశారు. ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్నారు.
ప్యారడైజ్ నుంచి సమీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సవాళ్లతో కూడిన టాస్క్‌గా అధికారులు భావిస్తున్నారు. భూసేకరణ, ట్రాఫిక్ మళ్లింపు, మౌళిక వసతుల కల్పన అన్నింటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినా సరే ఇది పూర్తి అయితే గంటల ప్రయాణం నిమిషాల్లోకి మారుతుంది. అంతే కాకుండా మేడ్చల్, సమీర్‌పేట్‌తోపాటు ఆ దారి చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. ఇది పూర్తి అయితే కచ్చితంగా హైదరాబాద్‌కు మరో మణిహారం తోడైనట్టుగా అధికారులు చెబుతున్నారు.




















