IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Hyderabad: వీధి కుక్కతో వృద్ధుడు అసభ్యకర చర్య! వీడియో వైరల్, వ్యక్తిపై కేసు నమోదు

నల్లకుంటలోని నర్సింహ బస్తీలో 60 ఏళ్ల వయసు గల ఓ వృద్ధుడు వీధి కుక్క ప్రైవేట్‌ అవయవంపై చెయ్యి వేసి అసభ్యకరంగా నిమిరాడు.

FOLLOW US: 

హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు వింత చేష్టకు పాల్పడ్డాడు. ఓ వీధి కుక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ గుర్తు తెలియని వ్యక్తిపై నల్లకుంటలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఈ నెల 6న వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఇది ఓ జంతు ప్రేమికుడు చూడడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నల్లకుంట పోలీసులు కుక్కతో వింతగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

నల్లకుంట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వీధి కుక్క పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నల్లకుంటలోని నర్సింహ బస్తీలో 60 ఏళ్ల వయసు గల ఓ వృద్ధుడు వీధి కుక్క ప్రైవేట్‌ అవయవంపై చెయ్యి వేసి అసభ్యకరంగా నిమిరాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ నెల 6న అది వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేశాడు. అలా అది నల్లకుంటలోని బృందావన్‌ కాలనీలో నివసించే యానిమల్‌ ప్రొటెక్షన్‌ సభ్యుడు, జంతు ప్రేమికుడు అయిన పన్నీర్‌ తేజను చేరింది. వెంటనే నర్సింహబస్తీకి వెళ్లిన ఆయన ఆ వీధి కుక్కను గుర్తించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ చర్యకు పాల్పడిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గత ఆదివారం నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు.

పెరిగిన వీధి కుక్కల సంఖ్య
పదేళ్లలో హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. పదేళ్ల క్రితం వాటి జనాభా 1.5 లక్షలు ఉండగా, గత జూన్ నాటికి వీటి సంఖ్య 6.97 లక్షలకు చేరింది. గతంలో వీధికుక్కలు పిల్లలపై దాడి చేయడం వల్ల వారు మరణించిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడు అయాన్‌పై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో బాలుడు అయాన్‌ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వీధి కుక్క కరిస్తే ఇలా చేయాలి
కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కుక్క కొరకడం వల్ల దాని లాలాజలంలో ఉండే వైరస్‌ రోజుకు అర సెంటిమీటర్‌ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్వరం, తల నొప్పి, వాంతులు తొలిదశలో కనిపిస్తాయి. రెండో దశలో పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించలేక పోవడం, నోటిలోంచి నురుగు రావడం, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉంటాయి. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కుక్క కరిస్తే పారుతున్న నీటితో శుభ్రంగా కడగాలి. రక్తం కారుతున్నా, లేదా పిక్క ఊడినా కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటి నాటు వైద్యాల జోలికి పోకూడదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో ఇంజెక్షన్లు వేయించుకోవాలి.

Published at : 11 Feb 2022 03:12 PM (IST) Tags: Hyderabad News Dogs in Hyderabad street dogs in Hyderabad Nallakunta street dogs news

సంబంధిత కథనాలు

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు