By: ABP Desam | Updated at : 16 Jan 2023 03:11 PM (IST)
Edited By: jyothi
సందర్శకులతో కిటకిటలాడుతున్న నుమాయిష్ - ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారంటే?
Numaish Exhibition 2023: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సందర్శకుల తాకిడి పెరిగింది. పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ ను రోజూ వేల సంఖ్యలో సందర్శిస్తున్నట్లు బుకింగ్ కిమిటీ ఛైర్మన్ హన్మంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేసినట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్ కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు.
జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన నుమాయిష్
ప్రతీ ఏటా ఎంతో గ్రాండ్ గా నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన ఈ నుమాయిష్.. 46 రోజుల పాటు సందడిగా సాగనుంది. అయితే ఈ ఎగ్జిబిషన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలి, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతీ రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకూ ఎగ్జిబిష్ గ్రౌండ్‌లోకి సందర్మకులను అనుమతిస్తారు. టికెట్ ధరను ఈసారి పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.30 ఉంటే ఈసారి నుంచి 40 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 దాటాక ఎగ్జిబిషన్ లోపలకు సందర్మకులను అనుమతిస్తే, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 600 రూపాయలు చెల్లించి నేరుగా కారులో లోపలికి వెళ్లి నుమాయిష్ చుట్టివచ్చే విధంగా ఈసారి అవకాశం కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
82వ నుమాయిష్..
ఈ ఏడాది 82వ నుమాయిష్ ను నిర్వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడకు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. వీక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విజిటర్స్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి అవ్వడంతో స్టాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
1938లో స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభిమైన ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు. అనంతరం నుమాయిష్ ఎగ్జిబిషన్(Numaish Exihibition) కు ఆదరణ పెరిగింది. స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, ఫుడ్ కోర్ట్(Food Court)లతో పాటు దేశంలోని వ్యాపారులు నుమాయిష్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎగ్జిబిషన్ ను ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్!
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా- హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు!
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!