News
News
X

Hyderabad News: అర్ధరాత్రి గోడ దూకిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ - మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడేందుకు యత్నం

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు అయిన కాట్రగడ్డ ప్రసూన ఇంట్లోకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఒకతను అర్ధరాత్రి చొరబడ్డాడు. శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి  ప్రహరీ దూకి మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డాడు

FOLLOW US: 

Hyderabad News:  హైదరాబాద్ లో అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి ఒక యువకుడు చొరబడడం చర్చనీయాంశమైంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట రోడ్డులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు అయిన కాట్రగడ్డ ప్రసూన ఇంట్లోకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఒకతను అర్ధరాత్రి చొరబడ్డాడు. శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి  ప్రహరీ దూకి మాజీ ఎమ్మెల్యే ఉంటున్న పై పోర్షన్ గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన కింది ఫ్లోర్ లో ఉంటున్న డ్రైవర్ అప్రమత్తమై ఫోన్ చేసి ఆమెకు సమాచారమిచ్చారు. ప్రసూన, ఆమె కుటుంబసభ్యులు లైట్లు వేసేసరికి అతను గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రసూన, ఆమె కుమార్తె కరణం అంబికా కృష్ణ చౌదరి తమ అనుచరులతో కలిసి అతడి కోసం గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఒక బార్ లో ఉన్నట్లు గుర్తించి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన చంద్రశేఖర్ అని తేలింది. మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించినట్లు అతను చెప్పాడని పోలీసులు తెలిపారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు, బల్కంపేట లోని ఓ హాస్టల్ లో ఉంటున్నట్లు చెప్పాడని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని తెలిపారు. 

News Reels

నన్నుచంపేందుకు ప్రయత్నిస్తున్నారు

ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే ప్రసూన కుమార్తె అంబిక కృష్ణ మాట్లాడారు. తనకు కరణం వెంకటేష్ అనే వ్యక్తితో విభేదాలున్నట్లు తెలిపారు. అతనే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వెంకటేష్ అనుచరుడు త్రివేది అనే వ్యక్తిపై తాము ఇదివరకే చీరాల డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పింది. 

Published at : 14 Nov 2022 07:20 PM (IST) Tags: Hyderabad crime news Hyderbad news Hyderabad SR nagar news Former MLA prasuna

సంబంధిత కథనాలు

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్

V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్- 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్-  22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్