News
News
X

Hyderabad News: విద్యార్థిని అత్యాచారం కేసులో విస్తుపోయే వాస్తవాలు - ఆ వీడియోలు చూసి రెచ్చిపోయిన బాలురు ! 

Hyderabad News: హయత్ నగర్ విద్యార్థిని అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డ బాలురు.. అలాగే చేయాలని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

FOLLOW US: 
Share:

Hyderabad News: హైదరాబాద్ హయత్ నగర్ లో జరిగిన పదో తరగతి అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల ఫోన్ తీసుకున్న ఓ అబ్బాయి అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. వాటినే తన స్నేహితులకు కూడా చూపిస్తూ అలవాటుగా మార్చుకున్నారు. ఆ వీడియోల్లో లాగే చేయాలని నిర్ణయించుకుని పథకం ప్రకారమే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి మరోసారి దారుణానికి ఒడిగట్టారు. 

హయత్ నగర్ కు చెందిన ఓ బాలుడు తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ తీసుకొని అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌కి కూడా ఆ వీడియోల గురించి చెప్పాడు. వాళ్లంతా కలిసి వీడియోలు చూశారు. రోజూ క్లాస్ అయిపోగానే వారంతా కలిసి ఎవరూ లేని ప్లేస్‌కు వెళ్లి అశ్లీల వీడియోలు చూసేవారు. నెల రోజుల పాటు వీడియోలు చూశాక వారి మైండ్‌ పూర్తిగా అలాంటి ఆలోచనలతో నిండిపోయింది. వారిలో కోరికలు మొదలయ్యాయి. ఆ వీడియోల్లో ఉన్నట్లుగానే చేయాలని నిర్ణయించుకున్నారు.

వీడియోల్లో ఉన్నట్టుగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ విద్యార్థులు.. తమ క్లాస్‌మీట్‌కు వల వేశారు. ఓ అమాయకురాలైన అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె చదువుతున్నది పదో తరగతే అయినప్పటికీ మాససికంగా చిన్న పిల్లల ప్రవర్తించడంతో ఆమెనే వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మాయ మాటలు చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు మొదటి సారి అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు అమ్మాయిని జీవితాన్ని పాడు చేశారు. అయితే ఈ తతంగాన్ని అంతా అందులో ఉండే మరో అబ్బాయి వీడియో తీశాడు. దాన్ని చూపిస్తూ రెండో సారి కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. 

పది రోజుల తర్వాత మరోసారి..

ఘటన జరిగిన మరో 10 రోజుల తరువాత బెదిరించి బాలికపై మరోసారి బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్ళీ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అయితే ఐదో బాలుడికి అవకాశం ఇవ్వలేదని కోపంతో ఆ వీడియోలను ఏకంగా 50 మందికి పంపాడు. అలా వైరల్ అయిన వీడియో బాధిత తల్లిదండ్రుల ఫోన్‌కి కూడా వచ్చింది. దీంతో బాలికను తల్లి నిలదీసి అడగగా బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. న్యాయం కోసం స్థానిక కార్పొరేటర్ ను, పెద్దలను ఆశ్రయించినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాలికను బాలకల వసతి గృహంలో చేర్చారు.

పలు టీవీలు, పేపర్లపై మానవ హక్కుల కమిషన్ ఫైర్..

బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ప్రాంతం, పాఠశాల బహిర్గతం చేయడంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని పత్రికలు, ఛానెళ్లలో బాలిక నివాసం పాఠశాల ఫొటోలను ప్రచురించడం పట్ల హెచ్సీ ఫైర్ అయినట్లు సమాచారం. అంతే కాకుండా బాధ్యులపై కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. పదో తరగతి చదువుతున్న బాలురి దురాలోచనలు, మానసిక స్థితి ఈ స్థాయిలో ఉండడం చూసి పోలీసులు, ఈ ఘటన గురించి తెలిసుకున్న కమిషన్ సభ్యులు సైతం దిగ్భ్రాంతి చెందుతున్నారు. అంతటి క్రూరమైన ఆలోచనలు ఆ 15 ఏళ్ల వయసులో రావడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు. 

Published at : 01 Dec 2022 11:22 AM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Telangana News Hayath Nagar Gang Rape Student Gang Rape Case

సంబంధిత కథనాలు

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం