అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Drugs in Hyderabad: డ్రగ్స్ దందాలో యువతి! 14 లక్షల మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ - కిలాడీ లేడీని పట్టేసిన పోలీసులు

ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ కీలక వివరాలు వెల్లడించారు.

డ్రగ్స్ దందాలో ఇప్పటిదాకా నైజీరియన్లు లేదా మగవారో పట్టుబడడం చూశాం. కానీ, తాజాగా ఓ యువతి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్‌ఎస్‌డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్‌ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు వారి మీద కేసు పెట్టారు. వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ కీలక వివరాలు వెల్లడించారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని అన్నారు. డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు. ఆమె తరచూ గోవాకు వెళ్తూ ఉండడం.. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చిందని అన్నారు. 

గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసిందని, నగరానికి తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గ్రాము రూ.20 వేలకు పైగా అమ్మిందని తెలిపారు. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారాడని చెప్పారు. 

అంతేకాక, ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని వెల్లడించారు. శివ కూడా కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారి అనురాధకు సహకరించినట్లు వెల్లడించారు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నామని, వారి మూడు వాహనాలు సీజ్ చేసినట్లుగా చెప్పారు. వారి ఫోన్లు కూడా సీజ్ చేశామని వెల్లడించారు. అందులో వారి కస్టమర్లకు సంబంధించి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు. వీరిని రిమాండ్ చేసి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, వారి నెట్ వర్క్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వివరించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget