Hyderabad: బీజేపీ నేత మిస్సింగ్ కేసు: సడెన్‌గా పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం - ఆ BRS నేతపై సంచలన ఆరోపణలు
కొద్ది రోజుల క్రితం తిరుపతి రెడ్డి మిస్ అయ్యి, ఇప్పుడు ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్ కి రావడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ లో కొద్ది రోజుల క్రితం మిస్ అయిన బీజేపీ నేత ముక్కెర తిరుపతి రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి రెడ్డి మిస్ అయ్యి, ఇప్పుడు ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్ కి రావడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. ఆయన అదృశ్యంపై సమాచారం తెలుసుకునేందుకు ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఆయన ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఆశ్రయం పొందారు? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయన భార్య కిడ్నాప్ చేశారని ఆరోపణ చేసినట్లుగా తిరుపతి రెడ్డిని ఎవరైనా నిజంగానే కిడ్నాప్ చేశారా? లేక ఆయనే సొంతంగా కనిపించకుండా పోయారా? అనే కోణాల్లో పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. తనకు ఎవరితో భూ వివాదాలు ఉన్నాయనే కోణాల్లో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
జులై 13వ తేదీ గురువారం రోజు అల్వాల్ తహశీల్దార్ ఆఫీసు ఎదుట తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారని తిరుపతి రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జూలై 13 నుంచి తిరుపతి రెడ్డి ఆచూకీ తెలియరాలేదు. తాజాగా పోలీస్ స్టేషన్ లో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎమ్మెల్యే మైనంపల్లిపై ఆరోపణలు
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనను నన్ను కిడ్నాప్ చేసి చంపాలని తన అనుచరులతో ప్రయత్నించాడని తిరుపతి రెడ్డి పోలీసుల విచారణలో చెప్పారు. తాను భయంతో విజయవాడ, విశాఖపట్టణం వెళ్లానని చెప్పారు. తనకు మైనంపల్లి ఎనిమిది సార్లు తనకు ఫోన్ చేశారని, బెదిరింపులు వస్తుండడంతో గతంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. హైకోర్టు అడ్వికేట్ సలహా మేరకు నేడు తాను డీసీపీ ఆఫీసుకు వచ్చానని తిరుపతి రెడ్డి చెప్పారు.