Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత.. ఇళ్లలోకి వరద నీరు, ఎక్కడ చూసినా ముంపు సీన్లు
Hyderabad Rains: హైదరాబాద్ మరోసారి నీట మునిగింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. ఎక్కడ చూసిన ముంపు సీన్లు కనిపిస్తున్నాయి.

Hyderabad Rains: కుండపోత వర్షానికి హైదరాబాద్ ఆగమైంది. రాత్రంతా పడుతున్న వాన జనాలను టెన్షన్ పెట్టించింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా మేగమంతా వచ్చి భాగ్యనగరంపై పడింది. సాయంత్రం ఇళ్లకు బయల్దేరే ఉద్యోగులు, శ్రావణ శుక్రవారం పూజల కోసం సామాగ్రి కొనుక్కునేందుకు బయటకు వచ్చిన వారంతా తడిసి ముద్దై దారులు వెతుక్కొని ఇంటికి చేరారు. రికార్డు స్థాయిలో కురిసిన వాన భయపెట్టింది.
ఉక్క పోతతో మొదలై ఊపిరాడకుండా చేసింది
ఉదయం ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే వాన ముంచెత్తుతుందని వారు అనుకోలేదు. ప్రశాంతంగా చల్లగాలిలో ఇంటికి బయల్దేరారు. నాలుగు చినుకులు పడేలోపు ఇంటికి చేరుకుందామని కొందరు, అలాషికారుకు వెళ్లిన వాళ్లు మరికొందరు, ఇలా వివిధ కారణాలతో వెళ్లిన వాళ్లంతా టెన్షన్ పడేలా వాన దంచి కొట్టింది. ఈ రాత్రికి ఇంటికి చేరుకోగలమా అనేలా కమ్మేసింది. ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా అన్ని ప్రాంతాలను కుమ్మిపడేసింది.
నీట మునిగిన అపార్ట్మెంట్‌లు
కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయని సాధారణంగా చెప్పుకుంటారు. కానీ ఈసారి అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అపార్ట్మెంట్లలోకి నీరు వచ్చి చేరింది. ఆఫీసుల్లోకి నీరు వచ్చింది. లిఫ్టుల్లోకి కూడా వరద నీరు చేరింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ చూసిన ముంపు సీన్లు కనిపిస్తున్నాయి.
కష్టమ్మీద ఇంటికి చేరుకున్న ఉద్యోగులు
అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. వ్యక్తులు కూడా కొట్టుకుపోయారు. బయటకు వెళ్లిన వాళ్లంతా అతి కష్టమ్మీద ఇంటికి చేరుకున్నారు. ఓలా ఉబర్లో వాహనాలు కూడా బుక్ కాలేదు. ఇంటికి చేరే దారి నడుచుకుంటూనే వర్షం లో తడుస్తూ చేరుకున్నారు.
#HyderabadRains: Post-rain scenes across #Hyderabad after a few hours of rainfall.#Hyderabad #Monsoon2025 pic.twitter.com/BMY2GZnpwi
— Anusha Puppala (@anusha_puppala) August 7, 2025
వర్షం ధారళంగా కురిసింది రెండు గంటలే కానీ దాని ప్రభావం మాత్రం రాత్రంతా ఉంది. ఆ తర్వాత కూడా వాన తెలిపిరి ఇవ్వలేదు. జల్లుల రూపంలో పడుతూనే ఉంది. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరిలించారు. వర్షాలు వదిలే వరకు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగుతూ కనిపించాయి. ఇది కూడా వరద ఉప్పొంగడటానికి కారణమైంది.
Helped a resident reach home safely.
— Akula Srivani (@akula_srivani) August 7, 2025
That's how unsafe our neighborhoods have become.
Thanks to GHMC failure to act on naala encroachments & illegal constructions, rainwater stagnation is now a public hazard.
Who is responsible for this mess?#HyderabadRains #Hyderabad #ghmc… pic.twitter.com/FgTjClTSrN
Police Anna On Duty in Heavy Rain
— Yash (@itsmeeyashin) August 7, 2025
Really 🫡🫡🫡 @hydcitypolice @CVAnandIPS @TelanganaCMO #Hyderabad #HyderabadRains pic.twitter.com/4gIEdLxjCL





















