Hyderabad Weather:హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్! హైటెక్ నగరాన్ని ముంచెత్తిన వాన
Hyderabad Weather:హైదరాబాద్‌లో కుండపోత వాన నగరాన్ని ముంచెత్తింది. రెండు గంటలపాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.

Hyderabad Weather:హైదరాబాద్లో వాతావరణం అర్థం కావడం లేదు. ఉదయం నుంచి సాయంత్ర వరకు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి వాన దంచి కొడుతోంది. ఏ స్థాయిలో అంటే ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు వాన కురుస్తోంది. గురువారం కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. హయత్నగర్ నుంచి కూకట్పల్లి వరకు ఇటు శంషాబాద్ నుంచి అటు పటాన్ చెరు వరకు ఏకధాటిగా వాన కుమ్మేసింది.
CLOUDBURST WARNING FOR HYDERABAD CITY ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) August 7, 2025
My hands are shivering while I type this message. Few parts of Hyderabad City to get 80-100mm rains in 1hour, close to CLOUBURST INTENSITY. Please please STAY SAFE 🙏
ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తుంది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుందని చెప్పింది. అయితే అధికారులు చెప్పిన దాని కంటే భారీ స్థాయిలో వర్షం కురిసింది. మరికొందరు ప్రైవేటుగా వెదర్ను అంచనా వేసే వాళ్లు అయితే 80-100mm మధ్య వర్షపాతం నమోదు అవుతుందని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సాధారణంగా క్లౌడ్ బరస్ట్ టైంలోనే 100mm కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
నిలిచిపోయిన వాహనాలు
ఒక్కసారిగా కురిసిన వర్షానికి హైదరాబాద్లో మరోసారి స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉద్యోగులు ఇళ్లకు చేరేందుకు నానా అవస్తలు పడ్డారు. రోడ్డుపై ఉన్న వాళ్లు తడిసి ముద్దయ్యారు. ఆఫీసుల్లో ఉన్న వాళ్లు గంటల తరబడి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
భయం భయంగా రోడ్లపై ప్రయాణం
రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జామ్. నగరవాసులు వర్షాలు పడుతుండగానే చుక్కలు చూశారు. మోకాళ్ల లోతు నీరు వారిని చికాకు పెట్టింది. ఎటు వెళ్లాలో అర్థం కాక ఇబ్బంది పడ్డారు. ఎక్కడ ఎలాంటి నాలా గోతులు, మ్యాన్ హోల్స్ ఉంటాయో అని భయం భయంగానే వాహనాలు నడుపుకొని ఇళ్లకు చేరారు.
లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటి మాదిరిగానే నీరు నిలిచిపోయింది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన భారీ వర్షానికి లోతట్టు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. చాలా ఫ్లైఓవర్లపై నుంచి భారీగా వర్షపు నీరు రోడ్డుపైకి వస్తున్నాయి.
పూజాసామగ్రి కొనలేకపోయిన మహిళలు
అసలే రేపు శ్రావణ శుక్రవారం. షాపింగ్కు, పూజా సామానులకు వెళ్లిన వాళ్లంతా వార్షంలో చిక్కుకుపోయారు. పండగ టైంలో నాలుగు డబ్బులు సంపాదించుకుందామని పూజా, పత్రి, ఫ్రూట్స్, పూల దుకాణాలు పెట్టిన వారికి కూడా నిరాశ ఎదురైంది. ఇలాంటి పండగల టైంలో సాయంత్రం వేళలోనే ఎక్కువ బిజినెస్ అవుతుంది. అలాంటి బిజినెస్ను వర్షం కొట్టుకుపోయిందని వ్యాపారులు లబోదిబోమన్నారు. సాయంత్రం పూజా సామగ్రి ఇతర వస్తువులు కొనుక్కుందామని అనుకున్న వారి ప్లాన్లు బెడిసి కొట్టాయి.
Terrible Rains in South Hyderabad 🌧️#HyderabadRains pic.twitter.com/S5EZQqiwQx
— Hi Hyderabad (@HiHyderabad) August 7, 2025





















