Hyderabad Tree City : ప్రపంచంలోనే హైదరాబాద్ స్పెషల్ - మరోసారి ఆ ఘనత సాధించిన భాగ్యనగరం !
హైదరాబాద్ వరుసగా రెండో ఏడాది "ట్రీ సిటీ"గా ఎంపికైంది. రెండేళ్లలో మూడు కోట్ల యాభై లక్షలకుపైగా మొక్కలు నాటడంతో ఈ గుర్తింపు లభించింది
హైదరాబాద్ వరుసగా రెండో సారి ట్రీ సిటీగా ఎంపికైంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్, ఆర్బర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న నగరాలను గుర్తించి వాటికి ట్రీ సిటీస్ ఎంపిక చేస్తుంది. హైదరాబాద్ ఈ ఘనతను వరుసగా రెండో సారి సాధించింది. రెండేళ్లకో సారి ఈ ట్రీ సిటీస్ ను ఎంపిక చేస్తున్నారు. 2020లోనూ హైదరాబాద్ ట్రీ సిటీగా గుర్తింపు పొందింది. గత రెండేళ్లల్లో నగరంలో 3 కోట్ల 50 లక్షల 56వేల 635 మొక్కలు నాటినట్టు ఆర్బోర్ డే ఫౌండేషన్ పేర్కొంది.
ఆర్భర్ డే ఫౌండేషన్ ఐక్యరాజ్య సమితితో కలిసి దేశంలో మరే నగరానికి ఇలాంటి ఘనత దక్కలేదు. దేశంలో ఐఎఫ్ఓఎస్ గుర్తింపు పొందిన ఏకైక నగరం హైదరాబాద్ . ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి దక్కిన ఫలితమే ఇదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో తెలంగాణ సర్కార్ వివిధ పనుల ద్వారా కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో అత్యధికం హరిత హారం ద్వారానే నాటారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్ ఓ ఉద్యమంలా ఈ పచ్చదనాన్ని పెంచే చెట్లు నాటే కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కారణంగా హైదరాబాద్‌లో పచ్చదనం పెరిగింది. అత్యధిక మొక్కలు... చెట్లుగా మారి .. హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిని తగ్గించడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పచ్చనదనం పెంపుపై సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన ఆసక్తితో ఉన్నారు. పెద్ద మొత్తం వెచ్చించి మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తూంటారు. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ చట్టంలో ఇందు కోసం ప్రత్యేక సెక్షన్లు కూడా పెట్టారు.
హైదరాబాద్ వరుసగా రెండో సారి ట్రీ సిటీ గుర్తింపు దక్కించుకోవటం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రీ సిటీ గుర్తింపునకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
It’s in second one in 2years. The credit largely goes to our beloved CM Sri #KCR sir who had introduced #HarithaHaaram programme right after the formation of #Telangana state & The way our young #IconicLeader in the capacity of Municipal Minister @KTRTRS has encouraged us a lot. pic.twitter.com/ksr8Z12dkm
— Santosh Kumar J (@MPsantoshtrs) April 12, 2022
పట్టణ, పురపాలక మంత్రిగా పచ్చదనం విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పచ్చనంపై స్పెషల్ టాస్క్ పెట్టుకున్నారు. ఈ విషయంలో ఫలితం వచ్చింది.