News
News
X

Formula E Racing : ఏపీలో కూడా ఫార్ములా ఈ రేస్ లు నిర్వహిస్తాం - మంత్రి గుడివాడ అమర్నాథ్

Formula E Racing : హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం అయింది. ఈ ఈవెంట్ లో ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అతిథిగా పాల్గొన్నారు.

FOLLOW US: 
Share:

Formula E Racing : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ రేసింగ్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఈ రేసింగ్ ను వీక్షించేందుకు ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవటంలో ఆంధ్ర ప్రజల పాత్ర కూడా ఉందన్నారు మంత్రి అమర్నాథ్. భవిష్యత్తులో ఏపీలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామన్నారు. ఫార్ములా ఈ రేస్ మొదటిసారిగా తెలుగు నేలపై జరుగుతున్నందకు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు వారిని ఈ స్థాయికి తీసుకెళ్లిన రేస్ నిర్వహకులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో ఈ కార్యక్రమం సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలన్నారు. చాలా దేశాల్లో వారి ఎకానమీ పెరగడానికి తెలుగు వారి కృషి ఉందన్నారు. అమెరికా ఎకానమీ పెరగడంలో తెలుగు వారి కృషి ఉందన్నారు. తెలుగు వారిగా పుట్టడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. హైదరాబాద్ అందరం కలిసి నిర్మించుకున్న నగరం అన్నారు. ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఆంధ్ర ప్రజల కృషి ఉందన్నారు. ఏపీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటామన్నారు. అందుకోసం ప్రయత్నం కూడా చేస్తామన్నారు. 

 రేస్ చూసేందుకు క్యూకట్టిన తారలు, స్టార్స్ 

హైదరాబాద్‌ ఫార్ములా ఈరేస్‌ మొదటి రోజు సందడిగా సాగుతోంది. మొదటి రోజు ఈవెంట్‌కు సినీ, స్పోర్ట్స్ సెలబ్రెటీలు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా నగరవాసులు వచ్చి రేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. భారీగా వచ్చిన జనంతో ట్యాంక్‌బండ్‌ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  హైదరాబాద్‌లో ఫార్మూలా ఈరేస్‌ గ్రాండ్‌గా మొదలైంది. ఉదయం నుంచి భారీగా ప్రేక్షకులు చేరుకున్నారు. రేస్‌ ప్రారంభమయ్యేసరికే గ్యాలరీలన్నీ నిండిపోయాయి.  భారత్‌లో తొలిసారిగా అదీ హైదరాబాద్‌లో జరుగుతుండటంతో దేశం నలుమూలల నుంచి ఫార్మూలా రేస్ లవర్స్ ఇక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ప్రారంభంకాగా ఉదయం నుంచే ఫ్యాన్స్ గ్యాలరీలకు చేరుకున్నారు. భవిష్యత్తు అంతా ఈ కార్స్ దే కాబట్టి మంత్రి కేటీఆర్ ఆలోచన ఇనీషియేటివ్ అద్భుతంగా ఉందంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్‌ ఫార్ములా ఈరేసింగ్‌లో ఈ ఉదయం క్వాలిఫైంగ్ రౌండ్ జరిగింది. దీన్ని చూసేందుకు క్రికెటర్లు వచ్చారు. సందడి చేశారు. సచిన్‌, చాహల్, దీపక్ చాహర్ ఈ వెంట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.  మెయిన్ రేస్ ప్రారంభం అయింది. ఇది 45 నిమిషాల పాటు సాగనుంది. 45 నిమిషాల్లో 18 మలుపులను క్రాస్‌ చేస్తూ రేస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా 32 ల్యాప్స్‌ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్‌ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్‌ 4 విన్నర్‌ అవుతారు. వారికి 25 పాయింట్లు లభిస్తాయి.  

ఆర్జే సూర్య సందడి 

హైదరాబాద్‌ ఫార్ములా ఈరేస్‌లో ఆర్జే సూర్య సందడి చేశాడు. గ్యాలరీల్లో తిరుగుతూ రేస్ ను వీక్షించాడు. ఏపీబీ దేశంతో మాట్లాడిన ఆర్జే సూర్య పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ ఈ రేస్ కు వస్తే ఎలా ఉంటుందో ఇమిటేషన్ చేసి చూపించాడు. నిన్న ట్యాంక్ బండ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రాంతంలో జరుగుతున్న రేసులకు లోకేష్ భార్య, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, ఎన్టీఆర్ భార్య ప్రణతి కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళడమే కాదు... పక్క పక్కన కూర్చుని నవ్వుతూ సందడి చేశారు.

Published at : 11 Feb 2023 04:09 PM (IST) Tags: Hyderabad AP News TS News Minister Gudivada Amarnath Formula E race

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా