By: ABP Desam | Updated at : 25 Sep 2023 05:03 PM (IST)
Edited By: Pavan
హైదరాబాద్‌లో మరో అతిపెద్ద షాపింగ్ మాల్, ఎక్కడో తెలుసా? ( Image Source : twitter.com/HyderabadMojo )
Lulu Mall Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉండగా.. మరో కొత్త షాపింగ్ మాల్ రాబోతుంది. లులు మాల్ తొలిసారిగా తెలంగాణలో తన మాల్ ను ప్రారంభించబోతోంది. సెప్టెంబర్ 27వ తేదీన కూకట్ పల్లిలో లులు మాల్ ఘనంగా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న భారీ షాపింగ్ మాల్స్ సరసన ఈ లులు షాపింగ్ మాల్ కూడా చేరనుంది. కూకట్ పల్లిలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులు మాల్ ఉంటుందని.. అందులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులు హైపర్ మార్కెట్ ఉంటుందనని ఆ కంపెనీ పేర్కొంది.
హైదరాబాద్ లో తమ మొదటి మాల్ ను ఏర్పాటు చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని లులు గ్రూప్ తన లింక్డ్ ఇన్ పోస్టులో తెలిపింది. లులు గ్రూప్ తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్న విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. లులు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. రూ.2,500 కోట్లతో మరో డెస్టినేషన్ మాల్ ను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశంలోని బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చి, లక్నో, కోయంబత్తూర్ లో లులు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరబోతోంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత సంవత్సరం దావోస్ లో వరల్డ్ ఏకనామిక్ ఫోరం కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే లులు మాల్ ను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయంపై చర్చలు జరిగాయి. అనంతరం లులు గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో కూడా లులు మాల్ ప్రారంభించేందుకు లులు గ్రూప్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని, అలాంటి చోట లులు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్లను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని లులు గ్రూప్ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు అవుతారు అననే విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫేమల్ సెలబ్రిటీలు, లేదా రాజకీయ ప్రముఖులను ఈ లులు మాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.
కూకట్ పల్లిలో ఏర్పాటు చేయనున్న లులు మాల్ మాత్రమే కాకుండా.. ఎగుమతులే లక్ష్యంతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడా లులు గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ను రూ. 200 కోట్లతో రోజుకు 60 టన్నుల మాంసం ఉత్పత్తి సామర్థ్యంతో చెంగిచర్లలో ఏర్పాటు చేయనుంది.
ఈ మాల్ లో 200 కి పైగా దుకాణాలు ఉంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఉంటాయి. 5 థియేటర్లు కూడా నిర్మించారు. మల్టీ కుషన్ ఫుడ్ కోర్టు, పిల్లల కోసం ఎంటర్‌టైన్మెంట్ జోన్లు, దేశీయ, విదేశీ బ్రాండ్లతో కూడిన రిటైలర్లు, ప్రేయర్ హాల్, మెడికల్ సెంటర్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఈ మాల్ లో ఒకేసారి 3 వేల కార్లను పార్కింగ్ చేసేలా నిర్మాణం చేశారు.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Hyderabad News: పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం, మరోచోట ఆటో వదిలి పరారైన దుండగులు! అసలేం జరిగింది!
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
/body>