News
News
X

Hyderabad: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు స్థలాలు కేటాయించండి: కేటీఆర్‌కు రెడ్కో చైర్మన్ వినతిపత్రం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీఎస్ఐఐసీకి చెందిన స్థలాలతో పాటు.. ఐటీ సెక్టార్, టీహబ్, టీ వర్క్స్ చెందిన స్థలాల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను సతీష్ రెడ్డి కోరారు. 

FOLLOW US: 
 
- కేటీఆర్ కు వినతిపత్రం అందజేసిన రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
- సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
- పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేస్

Hyderabad Electric Vehicles Charging Station: హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు చేయాలని కోరుతూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(రెడ్కో) చైర్మన్ వై.సతీష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీఎస్ఐఐసీకి చెందిన స్థలాలతో పాటు.. ఐటీ సెక్టార్, టీహబ్, టీ వర్క్స్ చెందిన స్థలాల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను సతీష్ రెడ్డి కోరారు. 
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు హైదరాబాద్ లోని టీఎస్ఐఐసీకి చెందిన 28 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని గుర్తించామన్నారు. పరిశ్రమల శాఖ ఆ స్థలాలు ఇస్తే ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(రెడ్కో) నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రాం స్కీం కింద డీసీ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల మౌలికవసతుల కల్పనకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి కేటీఆర్ కు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి  వివరించారు. 

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది !
దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని సతీష్ రెడ్డి తెలిపారు. కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు అవగాహన కల్పిస్తోందని చెప్పారన్నారు. ఇందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. మంత్రి కేటీఆర్ గారి చొరవతోనే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్యక్రమం జరగబోతోందని సతీష్ రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

పబ్లిక్ ప్లేసుల్లో ఈవీఎం ఛార్జింగ్ స్టేషన్లు
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే హైదరాబాద్ లో 292 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సతీష్ రెడ్డి చెప్పారు.  హైదరాబాద్ లోని పబ్లిక్ ప్లేసుల్లో అంటే ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ ప్లేసులు, బస్ డిపోలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో ప్రయత్నాలు చేస్తోందని వై.సతీష్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1301 ప్రాంతాలను రెడ్కో గుర్తించిందని తెలిపారు. రెడ్కోకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

News Reels

Published at : 16 Nov 2022 10:36 PM (IST) Tags: Hyderabad KTR TS REDCO Hyderabad Electric Vehicles Electric Vehicles Charging Station

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates:  నార్కేట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, లారీ-కారు ఢీకొని ఇద్దరు మృతి! 

Breaking News Live Telugu Updates: నార్కేట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, లారీ-కారు ఢీకొని ఇద్దరు మృతి! 

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

TS News Developments Today : నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సహా కీలక అప్ డేట్స్

TS News Developments Today : నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సహా కీలక అప్ డేట్స్

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

టాప్ స్టోరీస్

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!