News
News
X

TRS MLAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేలా జడ్జి ఆదేశాలు

ఈ వ్యవహారంలో పట్టుబడ్డ నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లను పోలీసులు గురువారం (అక్టోబరు 27) రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు.

FOLLOW US: 

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLA) కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్టు అయిన ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ రిజక్ట్ చేశారు. అందుకు సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ అనేది ఈ కేసులో వర్తించదని అన్నారు. బ్రైబ్ ఇవ్వబోయిన నగదు లేక పోవటంతో ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ తోసిపుచ్చారు. 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చి విచారణ చేయాలని న్యాయమూర్తి చెప్పారు.

ఈ వ్యవహారంలో పట్టుబడ్డ నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లను పోలీసులు గురువారం (అక్టోబరు 27) రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జి.రాజ గోపాల్‌ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులను వదిలి పెట్టామని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి చెప్పారు.

పూజల కోసమే వెళ్లాం - నందకుమార్

పూజకోసమే వెళ్లామని పైలట్‌ రోహిత్‌ రెడ్డి (Pilot Rohit Reddy) ఆరోపణలతో సంబంధం లేదని నిందితుడు నంద కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ తిరస్కరించడంతో పోలీసుల తర్వాతి చర్యలు ఏం చేపడతారు అనేది ఆసక్తిగా మారింది. 41 సీఆర్​పీసీ కింద నోటీసులు జారీ చేసి వారిని విచారించే అంశంపై పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

News Reels

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించి కొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు నిందితులపై 120-బీ, 171-బీ రెడ్‌ విత్‌ 171-ఈ, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ కరప్షన్‌ యాక్ట్- 1988 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద రూ. కోట్ల డబ్బు ఉందని ప్రచారం జరిగినా కానీ, పక్కా ఆధారాలను పోలీసులు సమర్పించలేదు. కానీ జాతీయ స్థాయిలో ఒక కీలక నాయకుడి సెక్రటరీ మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

టీఆర్ఎస్ (TRS) ను వీడి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి రూ.100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌ రెడ్డికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని స్వయంగా రోహిత్‌ రెడ్డే ఫిర్యాదు ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేసి విచారణ చేశారు.

రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌ ప్రాంతాన్ని సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Police) తమ అధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేశారు. డబ్బు ఎక్కడైనా దాచారా అనే అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు వినియోగించిన కారు డ్రైవర్‌ తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

Published at : 28 Oct 2022 07:30 AM (IST) Tags: Telangana BJP news TRS News Hyderabad News TRS MLAs buying incident ACB judge

సంబంధిత కథనాలు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్-కేసీఆర్ ఒక తాలిబన్: షర్మిల

ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్-కేసీఆర్ ఒక తాలిబన్: షర్మిల

KTR Tweet: ఇక ఆ ఛానెల్ చూడను, అన్‌ఫాలో చేసేస్తున్నా - ఆ వార్తలకు థ్యాంక్స్: కేటీఆర్

KTR Tweet: ఇక ఆ ఛానెల్ చూడను, అన్‌ఫాలో చేసేస్తున్నా - ఆ వార్తలకు థ్యాంక్స్: కేటీఆర్

Prashanth Reddy: సోనియాను వైఎస్‌ బ్లాక్‌ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: సోనియాను వైఎస్‌ బ్లాక్‌ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

IND vs NZ 3rd ODI: భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే- వర్షంతో నిలిచిన ఆట

IND vs NZ 3rd ODI: భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే- వర్షంతో నిలిచిన ఆట

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో