News
News
X

YS Sharmila: అర్ధరాత్రి షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం - వెంటనే ఆస్పత్రికి తరలింపు

ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు అనుమతించినా పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని లోటస్‌పాండ్‌లో ఉన్న తన పార్టీ కార్యాలయం ఆవరణలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

FOLLOW US: 
Share:

వైఎస్‌ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్టు చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు అనుమతించినా పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని లోటస్‌పాండ్‌లో ఉన్న తన పార్టీ కార్యాలయం ఆవరణలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా దీక్ష చేపట్టడంతో ఆమె ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెంటనే తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

అంతకుముందు శనివారం రాత్రి వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తున్నారని విమర్శించారు. ‘‘పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా ప్రభుత్వ, పోలీసులు అనుమతివ్వడం లేదు. మా నాయకులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు శనివారం సాయంత్రానికి కూడా విడుదల చేయలేదు. పాత కేసులు తవ్వి రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వట్లేదు. పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పాదయాత్రలో ఎక్కడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఏనాడూ మహిళల గురించి నోరు విప్పలేదు. పైగా నన్ను తిట్టారు. అదంతా ఆమె విచక్షణకే వదిలేస్తున్నా. 3,500 కిలోమీటర్ల పాదయాత్రలో ఒక్కసారి కూడా నేను నిబంధనలను ఉల్లంఘించలేదు.’’ అని మాట్లాడారు.

శనివారం రాత్రి షర్మిలను పలువురు పరామర్శించారు. ఆమెకు మద్దతుగా తల్లి వైఎస్‌ విజయలక్ష్మి దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు సుధీకర్‌ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తదితరులు షర్మిల వద్దకు వచ్చి ఆమెను పరామర్శించారు.

రెండ్రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష 

ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అరెస్టు చేసిన వైఎస్ఆర్టీపీ నేతలను విడుదల చేయాలని రెండ్రోజులుగా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు.  పార్టీ ఆఫీస్ కు నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీస్ లు అడ్డుకుంటున్నారు. లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది.

వైఎస్ షర్మిలకు వైద్యులు నిన్న (డిసెంబరు 10) ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుందని వైద్యుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. బీపీ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. గ్లూకోజ్  లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. 30 గంటలుగా షర్మిల మంచి నీళ్లు సైతం తీసుకోవడం లేదన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించకపోతే ప్రాణాలకు ప్రమాదమన్నారు. మరోవైపు, పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు తన దీక్ష విరమించనని షర్మిల అన్నారు. మొత్తానికి అర్ధరాత్రి పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.

హైకోర్టు అనుమతి ఇచ్చినా

సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటూ మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వైఎస్సార్టీపీని మాత్రం కార్యక్రమాలు చేసుకోవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతి ఇచ్చినా కేసీఆర్ నియంతృత్వ పాలనలో న్యాయస్థానానికి,  ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. తమ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.

Published at : 11 Dec 2022 07:33 AM (IST) Tags: YS Sharmila hunger strike Hyderaad Police Hunger-Strike YSRTP News Lotus pound

సంబంధిత కథనాలు

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

Hyderabad Crime: చైన్ స్నాచింగ్స్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్, చోరీలకు కారణం ఏంటంటే !

Hyderabad Crime: చైన్ స్నాచింగ్స్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్, చోరీలకు కారణం ఏంటంటే !

CM KCR: గోండి భాష అభివృద్ధికి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేయండి: సీఎం కేసీఆర్ ను కోరిన ఆదివాసీలు

CM KCR: గోండి భాష అభివృద్ధికి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేయండి: సీఎం కేసీఆర్ ను కోరిన ఆదివాసీలు

Union Budget 2023: తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.12, 824 కోట్లు కేటాయించాం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

Union Budget 2023: తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.12, 824 కోట్లు కేటాయించాం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్

Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్

టాప్ స్టోరీస్

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!