News
News
X

Hussain Sagar: వినాయక నిమజ్జనంతో తీవ్ర కాలుష్యానికి గురైన హుస్సేన్ సాగర్!

Hussain Sagar: గణేష్ నిమజ్జనోత్సవం కారణంగా హుస్సేన్ సాగర్ తీవ్ర కాలుష్యానికి గురైంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన నీటిని విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు ముందు చేసిన తర్వాత తీసుకొని పరీక్షిస్తున్నారు. 

FOLLOW US: 

Hussain Sagar: గణేష్ నిమజ్జనోత్సవంతో హుస్సేన్ సాగర్ తీవ్ర కాలుష్యానికి గురైంది. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల విగ్రహాలు వేసి ఉంటారని అధికారులు అంచనా వేశారు. నీటి నాణ్యతను లెక్కగట్టేందుకు కాలుష్య నియంత్రమ మండలి వేర్వేరు రోజుల్లో నమూనాలు సేకరించింది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా రెండో చోట్లు లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్ సహా బుద్ద విగ్రహం వద్ద ఆరు చోట్ల నీటి నమూనాలను తీసుకున్నారు. నిమజ్జనానికి ముందు... ఆ తర్వాత నీటిని సేకరించారు. అయితే వీటిలో బయో ఆక్సిజన్ డిమాండ్ మూడు లోపు ఉండాలి. కానీ 30కి పైగా ఉందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ నాలుగుకు బదులుగా 25 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. శనివారం కూడా నిమజ్జనం కొనసాగడంతో ఆదివారం నమూనాలు తీసుకున్నారు. 

వర్షాల కారణంగా కలుషిత నీరు మరింత కిందకు..

అప్పటికే భారీ విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో కెమికల్ ఆక్సిన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వినాయక నిమజ్జనం జరిగిన మూడ్రోజులు భారీ వర్షాలు కురవడంతో వరద నీటి కాలువలు, నాలాలా ద్వారా హుస్సేన్ సాగర్ లోకి కలుషిత నీరు భారీగా చేరింది. వర్షాల కారణంగా కలుషిత జలాలు కొంత పరిమాణం దిగువకు వెళ్లినట్లు తెలుస్తోంది. శని, ఆది వారాల్లో నాలాల ద్వారా ప్రమాదకర రసాయనాలు సాగర్ లోకి చేరుకున్నాయి. గతేడాది కూడా కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు నిర్వహించింది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా తీసుకున్న నీటి నమూనాల్లో బయో ఆక్సిజన్ డిమాండ్ అత్యధికంగా 45 మిల్లీ గ్రామ్స్ పర్ లీటర్ ఉందని తేలింది. 

అతినీల లోహిత నమూనాలు మరింత ఎక్కువ..

మరోచోట కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 199 మిల్లీ గ్రామ్స్ పర్ లీటర్ గా ఉందని గుర్తించారు. అతిభార లోహిత నమూనాలు ఎక్కువగా ఉన్నాయని పీసీబీ అధికారులు చెప్పారు. ఈసారి కూడా తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మట్టి ప్రతిమలు ఎక్కువగా ఉన్నందున.. కాలుష్యం స్థాయి ఎంత ఉందో తుది ఫలితాల ఆధారంగా తేలనుంది. 

అందుకే హైకోర్టు కూడా వద్దంది..!

హైదరాబాద్ జంట నగరాల్లోని హుస్సేన్ సాగర్ తో పాటు నదుల్లో  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీళ్లేదని గతంలోనే తెలంగాణ హైకోర్టు తెలిపింది. కేవులం చిన్న చిన్న చెరువుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను నిషేధించడంపై ఓం ప్రకాష్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ వేశారు. కళాకారుల తరఫున పిటిషన్ వేసిన ఇతను.. పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అలాగే విగ్రహాలను నిషేధిస్తే.. దానిపై ఆదారపడి బతుకున్న వేలాది మంది రోడ్డున పడతారని వివరించారు. స్పందించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Published at : 13 Sep 2022 12:00 PM (IST) Tags: Hyderabad News Ganesh Immersion Hussain Sagar Hussain Sagar pollution Ganesh Immersion in Hussain Sagar

సంబంధిత కథనాలు

Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

పబ్‌లో మైనర్‌ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు వీడియో ట్యాగ్‌!

పబ్‌లో మైనర్‌ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు  వీడియో  ట్యాగ్‌!

Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!

Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!

Hyderabad News: మీ వెహికిల్ ఇక్కడ పార్క్ చేశారో ఇక అంతే! Hyd లో ట్రాఫిక్ సమస్యకు కొత్త స్ట్రాటజీ

Hyderabad News: మీ వెహికిల్ ఇక్కడ పార్క్ చేశారో ఇక అంతే! Hyd లో ట్రాఫిక్ సమస్యకు కొత్త స్ట్రాటజీ

Hyderabad Traffic: నేడు ఈ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్! ఈ టైంలో ట్రాఫిక్ అడ్డంకులు, మరో దారి చూసుకోవాల్సిందే!

Hyderabad Traffic: నేడు ఈ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్! ఈ టైంలో ట్రాఫిక్ అడ్డంకులు, మరో దారి చూసుకోవాల్సిందే!

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!