Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! రెడ్ అలర్ట్ జిల్లాలు ఇవే!
Telangana Weather Update: అప్రమత్తంగా లేకుంటే కొట్టుకుపోతారు అంటున్నారు అధికారులు. ఆ స్థాయిలో తెలంగాణలో వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు.

Telangana Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వానలు నాలుగు రోజులు పాటు దంచి కొట్టబోతున్నాయి. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శాఖలన్నీ మరింత హుషారుగా పని చేయాలని ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
ఆగస్టు 12 నుంచి 15 వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
13వ తేదీ రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు;- హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి,
13వ తేదీ ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు;-భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట
13వ తేదీ ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు;-ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీమ్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల
14వ తేదీ రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు;- మెదక్, సంగారెడ్డి, వికారాబాద్,
14వ తేదీ ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు;- భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగామ్, ఖమ్మం, మహబూబాబాదా, మెడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యదాద్రి భవనగిరి
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :12-08-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/DhqVE80W19
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 12, 2025
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్‌లో వాతావరణం కొన్ని ప్రాంతాల్లో మబ్బులు పట్టింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మూసరంబాగ్ -చాదర్‌ఘాట్ కాజ్‌వేలను మూసివేశారు. ప్రయాణికులు గోల్నాకా -చాదర్‌ఘాట్ బ్రిడ్జ్‌ల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
హిమాయత్‌సాగర్ జలాశయానికి ఐదు గేట్లు తెరవడంతో మూసీ నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో సంగేం–భీమలింగం కట్వా వంతెనపైకి నీరు ప్రవహిస్తోంది.వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు బ్యారికేడ్లు వేసి, ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.
నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. అవసరం లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం అప్రమత్తం
తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని... అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుంది..ఎలా ఎదుర్కోవాలనే దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయని... కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని... క్లౌడ్ బస్టర్స్‌తో ఊహించనంత నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు. క్లౌడ్ బస్టర్ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్దం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.





















