Covid Fourth Wave News: కరోనా ఫోర్త్ వేవ్‌పై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు, యాదాద్రి పర్యటన సందర్భంగా కామెంట్స్
Srinivas Rao Yadadri Visit: కరోనా ఫోర్త్ వేవ్ పై తెలంగాణ సర్కారు అప్రమత్తంగానే ఉందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Srinivas Rao Yadadri Visit: కరోనా ఫోర్త్ వేవ్ పై తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్రమత్తంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభూలకు ప్రత్యేక పూజలు చేశారు. తన కూతురు మొదటి వివాహ వేడుకను జరుపుకుంటుందని.. ఈ క్రమంలోనే స్వామి వారి ఆశీస్సుల కోసం తాను యాదాద్రి వచ్చినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరినీ కరోనా కొత్త వేరియంట్ నుంచి కాపాడాలని స్వామి వారిని కోరుకున్నట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కరోనాకు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచినట్లు వివరించారు. రాష్ట్రంలో వంద శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని, హైర్బిడ్ ఇమ్యూనిటీ కూడా వచ్చినట్లు స్పష్టం చేశారు.
Had the blissful Dharshana of Lord Sree Lakshmi Narasimha Swamy at the magnificent #Yadadri Temple. Sought Lord's divine blessings for my daughter who is celebrating her 1st wedding anniversary & Prayed for the welfare of mankind & for Protection from New Coronavirus variant XBB pic.twitter.com/R9nBVCckZk
— Dr. Gadala Srinivasa Rao (@drgsrao) December 24, 2022
"ఒక శిలతోని మనం ఆలయాన్ని నిర్మించుకోవడం.. ఇంత అత్యద్భుతంగా ఈ శైలి నిర్మాణం ఉండడం నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని మనం చెప్పవచ్చు. ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చరిత్రలో పూర్తి స్థాయిలో నిలిచిపోనుంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతోంది. రాబోయే నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి ఇలా రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా." - శ్రీనివాస రావు, డీహెచ్
కరోనా కొత్త వేరియంట్ కు భయపడాల్సిన అవసరం ఏం లేదు..
బీఎఫ్7 వేరియంట్ కు అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదని ఏఐజీ ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్తగా వచ్చిన కొర్బి వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్ వచ్చే అవకాశం చాలా వరకు తక్కువని చెబుతున్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ ను బూస్టర్ డోస్ గా అందరూ తీసుకోవాలన్నారు. ముందు రెండు డోసులు కోవిషిల్డ్ లేదా కోవాక్సిన్ ఏది వేసుకున్నా బూస్టర్ డోసుగా ఈ కొర్బి వ్యాక్స్ ను తీసుకోవచ్చని చెప్పారు. ఈ వ్యాక్సిన్ కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వలన తక్కువ బాడీ పెయిన్స్, లైట్ ఫీవర్ ఉంటుందని వివరించారు.
చైనాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఫెయిల్ అయింది కాబట్టే మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం బాగా జరిగిందని చెప్పారు. ఇప్పుడు వచ్చే కరోనా కొత్త వేరియంట్ కూడా ఫిబ్రవరి చివరి వరకు పోతుందని అన్నారు. కొర్బి వ్యాక్స్ ను బూస్టర్ డోసుగా అందరూ తీసుకోవాలన్నారు. భారతీయులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారని.. కాబట్టి యాంటీ బాడీస్ ఉన్నాయని, ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉందన్నారు. బీఎఫ్7 వేరియంట్ అంత ప్రమాదం కాదని, ఇది ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్లడం లేదని వివరించారు. షుగర్ ఉన్న వారికి మాత్రం కొంత ప్రమాదం ఉందని, వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రెండు నెలలు ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు వాడాలని అన్నారు.