Ganesh Nimajjanam: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా TSRTC స్పెషల్ బస్సులు: సజ్జనార్

Ganesh Nimajjanam in Hyderabad:
హైదరాబాద్: పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. అతిపెద్ద గణపయ్య ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఈ నెల 28న నిర్వహించనున్నారు. నగరంలో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మొత్తం 535 ప్రత్యేక బస్సులను TSRTC నడపనుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసి నిమజ్జనం, శోభాయత్ర సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















