అన్వేషించండి
Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హెటిరో ల్యాబ్స్‌లో మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్టం

Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హెటిరో ల్యాబ్స్‌లో మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్టం
Fire Accident at Hetero Labs Limited in Sangareddy district | హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈటీపీ సెక్షన్లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే హెటిరో ల్యాబ్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా






















