News
News
X

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశ్రుతి - రెండు డీసీఎంలు, జనరేటర్లు కాలి బూడిద

తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఆదివారం (అక్టోబరు 30) ఐదో రోజు పూర్తయింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్ర సాయంత్రం షాద్‌నగర్‌ వద్ద ముగిసింది.

FOLLOW US: 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలోని పేపరస్‌ పోర్టు రిసార్ట్స్‌ సమీపంలో యాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 125కేవీ, 62 కేవీ జనరేటర్లు, రెండు డీసీఎం వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఆదివారం (అక్టోబరు 30) ఐదో రోజు పూర్తయింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్ర సాయంత్రం షాద్‌నగర్‌ వద్ద ముగిసింది. షాద్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్‌లో రాహుల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సోమవారం (అక్టోబరు 31) ఉదయం 10.30 గంటలకు రాహుల్‌ పాదయాత్ర కొత్తూరు చేరుకోనుంది.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను ఎలాంటి దోషాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో ఐదో రోజు ఆదివారం (అక్టోబరు 30) పాదయాత్ర ముగిసింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర సాయంత్రం షాద్‌ నగర్‌లో ముగిసింది. షాద్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఎలాంటి హింస, ఇబ్బందులు లేకుండా భారత్ జోడో యాత్ర నడుస్తోందని, ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎండ వచ్చినా, వాన కురిసినా, తుపాన్లు వచ్చినా సరే కశ్మీర్ వరకు యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. 

టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకే కోవకు చెందినవని రెండూ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ చట్టాలతో పాటు పార్లమెంట్‌ లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు తెలంగాణలో పాలన పట్ల తమ గోడు చెప్పుకుంటున్నారని.. బీజేపీ, టీఆర్ఎస్‌ లీడర్లు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు.

News Reels

మోదీ పాలన వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసరాలు వంటి అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటినా మోదీ దానిపై నోరు విప్పడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సన్నకారు వ్యాపారులకు అనేక రకాలుగా మేలు చేస్తామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

53 రోజుల నుంచి కొనసాగుతున్న యాత్ర

కన్యాకుమారి నుంచి 53 రోజులుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ విద్వేషం, టీఆర్ఎస్ దోపిడీపై విమర్శలు కురిపిస్తూ వెళ్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేటు పరం అవుతోందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం ఉంది. అక్కడే యాత్రలో పాల్గొంటున్న వారంతా భోజనం చేయనున్నారు. అనంతరం సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనున్నారు. అక్కడే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు.

Published at : 31 Oct 2022 08:25 AM (IST) Tags: Telangana Congress Bharat Jodo Yatra Fire Accident Rahul Gandhi Kothur

సంబంధిత కథనాలు

Hyderabad: డ్రగ్స్ విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad: డ్రగ్స్ విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్

V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!