Telangana News: కేసీఆర్, బండి సంజయ్ లపై నమోదైన కేసులు కొట్టివేయండి- సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్
Revanth Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లపై గతంలో నమోదైన చిన్న చిన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం ఉపసహరించుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.
FGG requests Telangana CM to withdraw cases against KCR, Bandi Sanjay and Revanth Reddy: హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ లపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ వచ్చింది. కేసీఆర్, బండి సంజయ్ లతో పాటు రేవంత్ రెడ్డిపై సైతం నమోదైన చిన్న చిన్న కేసులను ఉపసంహరించుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ సీఎంకు లేఖ రాసింది.
వీటిలో 2011 మిలియన్ మార్చిలో బీఆర్ఎస్ అధినేతపై నమోదైన కేసు ఉంది. 2009లో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ పై పోలీసులు నమోదు చేసిన కేసు ఇంకా పెండింగ్ లో ఉందని లేఖలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి ప్రవేశించడంపై ఓ కేసు నమోదైంది. దాంతో పాటు బండి సంజయ్ పై నమోదైన మొత్తం 42 కేసులు కొట్టివేయాలని రిక్వెస్ట్ చేశారు.
పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారంటూ చేసిన కీలక ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. దాంతో పాటు కరోనా వ్యాప్తి సమయంలో కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు బండి సంజయ్ తో పాటు, రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.