అన్వేషించండి

Trains Full: పండుగకు ఊరెళ్లాలంటే అంత ఈజీకాదు- ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్‌-ప్రత్యేక రైళ్ల కోసం వెయిటింగ్‌

పండగలకు ఊరు వెళ్దామనుకుంటున్నారా? రైలెక్కి జమ్మని జర్నీ చేద్దామనుకుంటున్నారా? అయితే అది జరిగే పని కాదులెండి. రైళ్లలో బెర్త్‌లన్నీ ఇప్పటికే ఫుల్‌ అయ్యాయి. ఏ ట్రైన్‌లో చూసినా వెయిటింగ్‌ లిస్టే.

పండగ వచ్చిందంటే చాలా... ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య సరదాగా పండుగ చేసుకోవాని భావిస్తారు. కానీ... ఈసారి వారి ఆశ అడియాశ కాబోతోంది. దసరా, దపావళి సమయంలోనే కాదు... సంక్రాంతికి కూడా రైళ్లన్నీ నిండిపోయాయి. బెర్త్‌ కోసం క్లిక్‌ చేస్తే... కనీసం ఓపెన్‌ కాకుండా రిగ్రెట్‌ అని కనిపిస్తోంది. ప్రధాన రైళ్లలో అయితే... వెయిటింగ్‌ లిస్టు చాంతాడంత ఉంది. దీంతో పండగకు ఊరు వెళ్లాలనుకునే వారి పరేషన్‌ తప్పడంలేదు. 

సంక్రాంతికి ఇంకా 4 నెలలు ఉన్నా... రైళ్లలో సీటు మాత్రం లేదు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండగలు ఉన్నాయి. కానీ.. జనవరి 11 నుంచే రిజర్వేషన్‌ దొరకడంలేదు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఏపీకి నడిచే రైళ్లలో టికెట్ల బుకింగ్ పూర్తై రిగ్రెట్ చూపిస్తున్నాయి. ఏ ట్రైన్‌ చూసినా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ట్రైన్లలో వెయిటింగ్‌ లిస్టు ఐదారు వందలు దాటింది. దీంతో రైలు ప్రయాణంపై ఆశలు వదులుకుంటున్నారు ప్రయాణికులు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్నామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు.

సంక్రాంతి పండగకు.. హైదరాబాద్‎లో ఉండే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వారి సొంతూళ్లకు వెళ్తారు. అందుకోసం మూడు నెలల ముందే రైలు రిజర్వేషన్లు చేసుకుంటారు. కానీ ఈసారి  పెద్ద పండగకు నాలుగు నెలల సమయం ఉన్నా... అప్పుడే రైళ్లన్నీ నిండిపోవడంతో... వారంతా నిరాశ చెందుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం,  శ్రీకాకుళం, నర్సాపురం, తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో పండుగ సమయంలో రైల్వే శాఖ నడిపే ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ  ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహనాలే నమ్ముకుంటున్నారు. సంక్రాంతికే కాదు.. దసరా, దీపావళికీ ఇదే పరిస్థితి. పండుగల వేళ రైలులో కాలు పెట్టే ప్లేస్‌ కూడా  కనిపించడంలేదు. అక్టోబరు 24న దసరా కాగా.. 22న ఆదివారం నుంచే చాలామంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈసారి కూడా ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉంది. అంతేకాదు.. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వెయిటింగ్‌లిస్ట్‌ ఉన్న రైళ్లకు అదనపు బోగీలు కూడా అటాచ్‌ చేస్తూ ఉంటుంది. అయితే పండగలకు ఇంకా సమయం ఉండటంతో... ఆ దిశగా ఇంకా చర్యలు చేపట్టలేదు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కానీ... ప్రతి ఏటా పండగల సీజన్‌లో ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. రైళ్లలో ముందస్తు బుకింగ్‌లు కూడా పూర్తయిపోతున్నాయి. దీంతో రైల్వేశాఖ కూడా ఆలస్యం కాకుండా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తే.. పండగ ప్రయాణంపై పరేషాన్‌ తగ్గుతుంది. పండగలకు ఊరు వెళ్లాలనుకునే వారికి ఊరట లభిస్తుంది. ప్రత్నమ్యాయ ఏర్పాట్లు చేసుకోకుండా... ప్రత్యేక రైళ్లలో టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget