Double Bedroom House: ఖైరతాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రారంభం.. లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ అందజేత
Khairatabad: డిగ్నిటీ ఆఫ్ హౌసింగ్ అంటూ పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా ఇళ్లను నిర్మించి, లబ్దిదారులను ఎంపిక చేసి అందిస్తోంది. తాజాగా మరికొన్ని ఇండ్లను ప్రారంభించారు.
Double Bedroom House: ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. సీసీ రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు సైతం సర్కార్ చేపట్టింది. డిగ్నిటీ ఆఫ్ హౌసింగ్ అంటూ పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా ఇళ్లను నిర్మించి, లబ్దిదారులను ఎంపిక చేసి అందిస్తోంది. తాజాగా మరికొన్ని ఇండ్లను ప్రారంభించారు.
ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేసిన మంత్రులు @KTRTRS, @YadavTalasani, @mahmoodalitrs. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే @DNRTRS, మేయర్ @GadwalvijayaTRS, డిప్యూటీ మేయర్ @SrilathaMothe.#DignityHousing pic.twitter.com/4SBuxA4WMH
— TRS Party (@trspartyonline) February 3, 2022
ఇందిరానగర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదవారికి దశలవారీగా ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రులు తెలిపారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్ లో పేద ప్రజల కోసం రూ. 17.85 కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 210 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ @YadavTalasani, శ్రీ @mahmoodalitrs.#DignityHousing pic.twitter.com/73LogtCu9q
— TRS Party (@trspartyonline) February 3, 2022
తెలంగాణ ప్రభుత్వం ఖైరతాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం రూ. 17.85 కోట్లతో ప్రతిష్టాత్మకంగా 210 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక, అన్ని సదుపాయాలు పరిశీలించిన మంత్రులు నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించడంతో పాటు లబ్దిదారులకు వాటిని అందజేశారు.