అన్వేషించండి
Advertisement
DK Shiva Kumar: పార్క్ హయాత్‌లో డీకే శివకుమార్ కీలక భేటీలు, సీఎల్పీకి ముందే ఉత్కంఠ!
Telangana Congress News: సీఎల్పీ భేటీకి ముందు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో సీనియర్ నేతలతో డీకే శివకుమార్ కీలక సమావేశాలు నిర్వహించారు.
DK Shiva Kumar Meetings: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సీఎల్పీ భేటీకి ముందు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో సీనియర్ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ కూర్పు కోసం ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం డీకే శివకుమార్ తో పాటుగా ఇతర కాంగ్రెస్ నేతలు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు తరలివెళ్లారు. అక్కడ సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. నిజానికి సీఎల్పీ సమావేశం ఉదయం 9.30 గంటలకే జరగాల్సి ఉంది. డీకే శివకుమార్ సీనియర్ నేతలతో ఈ చర్చలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
హైదరాబాద్
ఇండియా
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion