News
News
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!

Delhi Liquor Scam: దేశ వ్యప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైకి బుచ్చిబాబు సీఏగా చేశారు.

FOLLOW US: 
Share:

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఆయన గతంలో ఎమ్మెల్సీ కవిత తోపాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు. దీంతో ఈయన అరెస్టు సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కేసులో ఇప్పటి వరకు సాగిన విచారణ, ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించి బుచ్చిబాబు పాత్రపై నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. అందుకే ఈ ఉదయం తెల్లవారేసరికి బుచ్చిబాబును అరెస్టు చేసింది సీబీఐ. అరెస్టుకు ముందు ఆయన్ని పలుమార్లు ఢిల్లీకి పిలిచి విచారించింది కూడా. అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఆపై విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రామచంద్ర పిళ్లై వద్ద చార్టెడ్ అకౌంట్‌గా పని చేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పని చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. కిందటి ఏడాది సెప్టెంబర్ లో లిక్కర్ స్కాం లింకులతో దేశ వ్యాప్తంగా నలభై చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ అరవింద్ నగర్ లోని శ్రీసాయి కృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఎమ్మెల్సీ కవిత స్థాపించిన భారత జాగృతి రిజిస్టర్ అడ్రస్ కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారి తీసింది. అప్పట్లో బుచ్చిబాబు ఎ్మమెల్సీ కవితతో బుచ్చిబాబు దిగిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. 

వారం రోజుల క్రితమే కీలక వ్యక్తుల పేర్లు వెల్లడి..

దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తుల పేర్లు ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో దిల్లీ సీఎం  అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి  గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్లు ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కవిత ఆదేశాలతోనే అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ స్పష్టం చేసింది. 

దిల్లీ సీఎం పేరు

ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ...ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం...ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని తెలిపింది ఈడీ. మరో సంచలనం ఏంటంటే...చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. మొదటి ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చిన ఈడీ... ఈసారి కేజ్రీవాల్ పేరునీ జోడించింది. 

Published at : 08 Feb 2023 11:15 AM (IST) Tags: Hyderabad News Telangana News Delhi Liquor Scam CBI Arrests Gorantla Buchhibabu Arrest

సంబంధిత కథనాలు

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు