అన్వేషించండి

 DAV Public School Incident: డీఏవి స్కూల్ ఘటనపై విద్యార్థి సంఘాల ఆందోళనలు!

DAV Public School Incident: ఎల్.కె.జి స్టూడెంట్ పై లైంగిక దాడి ఘటనపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

DAV Public School Incident: డీఏవీ స్కూల్ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు(బుధవారం) స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. డీఏవీ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని యథావిధిగా నడపాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు పోలీసుల భారీగా మోహరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. ఇప్పటికిప్పుడు స్కూల్ ను రద్దు చేస్తే తమ పిల్లల్ని ఎక్కడ చదివించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేరే పాఠశాలకు పంపుదామంటే సిలబస్ తోపాటు అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. 

ఇటీవలే పాఠశాల గుర్తింపు రద్దు చేసిన తెలంగాణ సర్కారు

ఎల్.కె.జి స్టూడెంట్‌పై లైంగిక దాడి ఘటనలో తెలంగాణ ప్రభుత్వం బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేసింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. తాజా నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని డీఈవోను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సందేహాల నివృతి చేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా పరమైన చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ నివేదిక రాగానే విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.   

పోక్సో కేసు 

బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో ప్రిన్సిపల్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రినిపల్ ను అరెస్టు చేశారు. డీఏవీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్లి చిన్నారిపై ప్రిన్సిపల్‌ వాహన డ్రైవర్‌ రజనీ కుమార్‌(34) లైంగిక దాడికి పాల్పడ్డాడు.  నిందితుడిని మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాలలో ప్రిన్సిపల్‌ రూమ్ సమీపంలోని డిజిటల్‌ తరగతి గదిలోనే డ్రైవర్ చిన్నారిపై లైంగిక దాడి చేసినా ప్రిన్సిపల్‌ మాధవి(56) నిరోధించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికీ స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

డీఏవీ స్కూల్ యాజమాన్యం విచారణ 

డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పర్తిపన్ ను స్కూల్ యాజమన్యం విధుల నుంచి బహిష్కరించింది.  ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఉన్న మాధవిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సఫిల్ గుడా డీఏవీ స్కూల్ బ్రాంచ్ కు ఫీడర్ బ్రాంచ్ గా ఉన్న బంజారాహిల్స్ బ్రాంచ్ నడుస్తోంది. ఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్ ఇంటర్నల్ కమిటీ హైదరాబాద్ ఘటనపై విచారణ చేస్తుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న BSD DAV పబ్లిక్ స్కూల్ లో LKG బాలికపై కార్ డ్రైవర్ రజినీకుమార్ గత రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడడం సంచలం అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్ , ఆమె డ్రైవర్ పై పోక్సో కేసు పెట్టారు.

టాప్ హెడ్ లైన్స్

KTR: చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget