అన్వేషించండి

Crime News: మెదక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనిల్ అనుమానాస్పద మృతి, బుల్లెట్లు గుర్తించిన పోలీసులు

Congress Leader Murder | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువతనేత అనిల్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఘటనా స్థలంలో బుల్లెట్లు కనిపించడంతో హత్య అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Medak Congress Leader Dies | మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతదేహాన్ని కారులో గుర్తించారు.

బుల్లెట్లతో మారిన క్రైమ్ సీన్

మెదక్- హైదరాబాద్ రోడ్డు పక్కన వాహనం అదుపుతప్పి ప్రమాదం జరగడంతో చనిపోయాడని తొలుత భావించారు. కానీ ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా, అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు. పోలీసులు యువతనేత అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Crime News: మెదక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనిల్ అనుమానాస్పద మృతి, బుల్లెట్లు గుర్తించిన పోలీసులు

రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ..
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ మొదట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు భావించారు. కానీ ఘటనా స్థలాన్ని పరిశీలించగా బుల్లెట్లు కనిపించాయని ఎస్సై గౌస్ తెలిపారు. సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామం పైతరకు కారులో బయలుదేరారు అనిల్. మండలంలోని చిన్నఘనపూర్ సబ్ స్టేషన్ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన చెట్టును కారు ఢీకొట్టినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అనిల్ ను స్థానికులు మెదక్ లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అనిల్ చనిపోయారు. అనిల్ మృతిపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తంచేశారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తే వారికి కొన్ని బుల్లెట్లు లభ్యం కావడంతో రోడ్డు ప్రమాదం కాదు, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

చనిపోతూ తన ఎడమ చేతిపై అనిల్  ఓ ఫోన్ నెంబర్ రాశారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాణ  సంస్థ యజమానులతో ఓ భూమి విషయంలో వివాదం ఉన్న సమయంలో అనిల్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. నానక్ రామ్ గూడలోని 6 గుంటల స్థలం విషయంలో అనిల్ కు, మరొకరితో గొడవలు ఉన్నాయి.  

కడప ఎమ్మెల్యే కుటుంబంతో వివాదం
కడప జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబానికి, కాంగ్రెస్ నేత అనిల్ కి కొంతకాలం నుంచి ఓ భూమి విషయంలో వివాదం ఉన్నట్లు సమాచరం. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద 80 లక్షలు, కారు తెచ్చినట్లు సమాచారం. 5 నెలలనుంచి బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుంది.

మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అనిల్(28) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రియల్ ఎస్టేట్ లో అనిల్ ఎదుగుదలను ఓర్వలేకే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. హత్యకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనిల్ డ్రైవ్ చేస్తున్న కారు విషయంలోను గొడవ జరిగిందని సమాచారం. ఓ సెటిల్ మెంట్ విషయంలో అనిల్ బెంజ్ కారు తీసుకువచ్చినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget