అన్వేషించండి

KCR News: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రత్యేకతలు ఏంటంటే

వేద పండితుల మంత్రోఛ్చారణల మధ్య, గుమ్మడికాయలతో దిష్ఠి తీస్తూ, ప్రత్యేక పూజలు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లో, పూరీ జగన్నాథ్ ఆలయం సమీపంలో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (ఆగస్టు 4) మధ్యాహ్నం ప్రారంభించారు. సీఎం వెంట మంత్రులు, పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోఛ్చారణల మధ్య, గుమ్మడికాయలతో దిష్ఠి తీస్తూ, ప్రత్యేక పూజలు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ నిర్వహించిన శిలాఫలకాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

అంతకుముందు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు పోలీసులు బైక్‌లతో స్వాగతం పలికారు. ఆ తర్వాత హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో కలిసి పోలీసుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్దకు అందరూ వెళ్లారు. అక్కడ పండితులు పూజలు చేశారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలోనే మొదటిసారిగా
దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. మొత్తం 600 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. పోలీసు విభాగానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ మూడో కన్నుగా చెబుతున్నారు. ఒకేసారి సుమారు లక్ష సీసీటీవీ కెమెరాలు చూసేలా కమాంట్ కంట్రోల్ సెంటర్ లో భారీ తెరను కూడా ఏర్పాటు చేశారు. సిబ్బంది 24 గంటల షిఫ్టుల విధానంలో పని చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిక్షిప్తం చేయడానికి అతి భారీ సర్వర్లను కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు.

ఆరేళ్లుగా నిర్మాణం
2016 నవంబర్‌ 22న ఈ భారీ భవన నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల వరకూ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లుగా అంచనా. వీటన్నిటినీ, అన్ని పోలీస్ స్టేషన్లను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. అన్ని ప్రాంతాల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ, క్రైమ్, క్రిమినల్స్ డేటా అన్ని ఇక్కడి నుంచి నియంత్రించే వీలు కలగనుంది. 

  • మొత్తం భవనం 6.42 లక్షల చదరపు అడుగులు, 2.16 లక్షల చదరపు అడుగులు పార్కింగ్ కోసం
  • భవనం మొత్తం ఎత్తు 272 అడుగులు
  • టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి గా నిర్మాణం, టవర్ ఈ గా నిర్మాణం
  • టవర్ ఏ 20 అంతస్తులు ఉంటుంది. ఇందులోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.
  • టవర్ బి 15 అంతస్తులు ఉంటుంది. ఇందులో డయల్‌-100, షీ సేఫ్టీ, సైబర్‌, నార్కోటిక్స్‌, క్రైమ్స్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఉంటాయి.
  • టవర్ సి జీ+2 గా ఉంటుంది. ఇది 480 మంది కూర్చోగల ఆడిటోరియం
  • టవర్ డి జీ+1 మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్
  • భవనం పైభాగంలో హెలీ ప్యాడ్‌
  • అద్దాల మేడ కావడంతో లోనికి ధారాళంగా వెలుతురు
  • సోలార్‌ ప్యానెల్స్‌తో 0.5 మెగావాట్స్‌ విద్యుత్తు ఉత్పత్తి
  • 35 శాతం స్థలంలో మొక్కల పెంపకం
  • యోగా సెంటర్‌, జిమ్‌, వెల్‌నెస్‌ సెంటర్‌

టాప్ హెడ్ లైన్స్

GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget