అన్వేషించండి

Revanth Reddy: హైదరాబాద్‌కు సీఎం రేవంత్ - 10 రోజుల పర్యటనలో జరిగిన ఎంవోయూలు ఇవే

Revanth Reddy News: సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల విదేశీ పర్యటన ముగిసింది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన సాగింది. పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నారు.

Revanth Reddy in Hyderabad: అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసిందని శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన సాగగా.. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ (ఆగస్టు 14) సాయంత్రం  కోకాపేట్ లో కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.    


Revanth Reddy: హైదరాబాద్‌కు సీఎం రేవంత్ - 10 రోజుల పర్యటనలో జరిగిన ఎంవోయూలు ఇవే

ఆగస్టు 3 నుంచి విదేశాల్లోనే సీఎం
ఆగస్టు 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా లోని సియోల్‌ కి చేరుకున్నారు. దక్షిణ కొరియాలో రెండ్రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు.. వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్‌కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ నెల 5న తెలంగాణ సర్కార్‌తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికా లోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. 

పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్‌లు నిర్వహించి పలు కంపెనీ లను క్షేత్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో, రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

దక్షిణ కొరియాలో
దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్​తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధుల తోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌  తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు. 

అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌ రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్​టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Appudo Ippudo Eppudo Trailer: ‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?
‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?
Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది -  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Asifabad News: ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎందుకంటే!
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎందుకంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాంతార లాంటి కల్చర్, ఆదివాసీ దండారీ వేడుకలు చూద్దామా!జలపాతంలో కలెక్టర్, సామాన్యుడిలా ఎంజాయ్!ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Appudo Ippudo Eppudo Trailer: ‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?
‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?
Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది -  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Asifabad News: ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎందుకంటే!
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎందుకంటే!
Andhra Assembly Sessions : 11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు  - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
India WTC Final: టెస్ట్ చరిత్రలో తొలిసారి వైట్ వైష్, భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి?
టెస్ట్ చరిత్రలో తొలిసారి వైట్ వైష్, భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి?
KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
Mysore Queen Special Train: మైసూర్ మహారాణి పర్సనల్ ట్రైన్ చూస్తారా? రైల్లోనే సింహాసనం, బెడ్ రూమ్ ఎన్నో విశేషాలు
మైసూర్ మహారాణి పర్సనల్ ట్రైన్ చూస్తారా? రైల్లోనే సింహాసనం, బెడ్ రూమ్ ఎన్నో విశేషాలు
Embed widget