అన్వేషించండి

నిన్న గూగుల్‌ టేకౌట్‌, నేడు ఐపీడీఆర్‌, వివేక కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ పట్టుకుంటున్న సీబీఐ

గూగుల్ టేకౌట్‌తో నిందితులు తిరిగిన, బస చేసిన సీబీఐ, ఐపీడీఆర్‌తో అనుమానితుల కాల్స్ డేటాను పట్టింది. దీంతో వివేక హత్య కేసులు మరిన్ని మలుపులు తిరిగే ఛాన్స్ కనిపిస్తోంది

మాజీ మంత్రి వివేక హత్య కేసును టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఛేదించాలని సాక్ష్యాలు సేకరించాలని సీబీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్‌ టేకౌట్‌ అంటూ నిందితులు ఎవరు ఎక్కడ ఎంత టైం ఉన్నారనే సమాచారాన్ని సేకరించింది. ఇప్పుడు కాల్ డేటాను ఎరైజ్ చేసి ఉంటారని గ్రహించిన దర్యాప్తు సంస్థ ఐపీడీఆర్‌(IPDR) అనే టెక్నాలజీని తెరపైకి తీసుకొచ్చింది. 

వివేక హత్య కేసు దర్యాప్తు సంస్థలకు చాలా సవాళ్లు చేసింది. చిక్కుముడులతో నిండిపోయిన ఉన్న ఈ కేసు ఛేదించడానికి అనేక మార్గాల్లో సీబీఐ ట్రై చేస్తోంది. అందుకే టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో విచారణ చేస్తోంది. గతంలో కోర్టుకు అఫిడవిట్ సమర్పించినప్పుడు గూగల్ టేకౌట్ అంటూ బాంబు పేల్చింది. దాన్ని పరిశీలిస్తే నిందితులంతా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని స్పష్టం చేసింది. వాళ్లంతా అక్కడ ఏం చేశారు. వివేకను చంపిన తర్వాత కూడా ఆయన ఇంటికి వెళ్లారని కోర్టుకు వివరించింది. వీటి చిక్కుముడులు విప్పాలంటే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమని తేల్చి చెప్పింది. 

ఇప్పుడు నేరుగా సీఎం జగన్ పేరును ఈ కేసులోకి లాగిన సీబీఐ... అవినాష్, జగన్‌ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు చెబుతోంది. దీనికి ఆధారంగా ఐపీడీఆర్‌ను సాక్ష్యంగా చూపిస్తోంది. అందుకే అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఆయన్ని అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని కోర్టకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

ఇంతకీ సీబీఐ చెప్పిన ఐపీడీఆర్‌ అంటే ఏంటో పరిశీలిస్తే... ఇంటర్నెట్ ప్రోటోకాల్ వివరాల రికార్డునే IPDR అంటారు. ఇందులో మన ఫోన్‌లో చేసే యాక్టివిటీస్ అన్నీ రికార్డు అవుతుంటాయి. వాట్సాప్ , టెలిగ్రామ్, ఇతర ఐపీ ఆధారిత కాల్స్‌, వీడియో కాల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అవసరమైనప్పుడు ప్రభుత్వ సంస్థలు వీటిని సర్వీస్ ప్రొవైడర్‌ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇంటర్నెట్ ప్రోటోకాల్ వివరాల రికార్డులు అంటే ఏమిటి?

IPDR అనేది ఇంటర్నెట్ వినియోగదారులు ఇంటర్‌నెట్‌ను యూజ్ చేసి చేసే ప్రతి పని రికార్డు అవుతుంది. దీన్ని బిల్లింగ్, అకౌంటింగ్ కోసం ISP నిర్వహిస్తుంది. అంతే కాు దీన్ని వినియోగదారు ఇంటర్నెట్ వినియోగాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు. అనుమానితులను ట్రాక్ చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు. 

అందరివి ట్రాక్ చేస్తారా?

మీ వాట్సాప్‌ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అందుకే మీ ప్రమేయం లేకుండా ట్యాప్ చేయడం కుదరదు. కానీ సీడీఆర్ (కాల్ డిటైల్ రికార్డు), ఇంటర్నెట్ ప్రోటోకాల్ వంటి సమాచారాన్ని ఉపయోగించే రికవరీ చేయవచ్చు. దీన్ని సరైన కారణాలతో దర్యాప్తు సంస్థలు మాత్రమే చేయగలవు. 

IPDR ఏం ఉంటాయి ?
IPDR లాగ్‌లు అనేక ఫీల్డ్‌లను కలిగి ఉంటాయి. వినియోగదారు ఇంటర్నెట్ యూసేజ్‌ వివరాలు వెల్లడిస్తాయి. ఇందులో ఏ మొబైల్ నంబర్‌కు కాల్ చేస్తోంది, ఎంత టైం మాట్లాడారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మాట్లాడారు, ఆ టైంలో వాడుకున్న డేటా ఎంత, వినియోగదారు పోర్ట్ నెంబర్, సెల్ టవర్ ID / ప్లేస్‌, ఇలా అన్ని వివరాలు క్లియర్‌గా తెలిసిపోతాయి. 

ఇలాంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 91, 92 ప్రకారం, పోలీసు లేదా కోర్టు అనుమానితుడి ఫోన్ ఐపీడీఆర్‌ సమాచారం కావాలని సర్వీస్ ప్రొవైడర్ కోరవచ్చు. ఆ ISP నోడల్ కార్యాలయం నుంచి కాపీలు తీసుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget