Chikoti Praveen in BJP: చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరికకు చివరి నిమిషంలో బ్రేక్, అధిష్టానం ఆదేశాలతో ట్విస్ట్
Chikoti Praveen Likely To Join BJP: నేడు చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరాల్సి ఉండగా.. చివరి నిమిషంలో క్యాసినో కింగ్ కు నిరాశే ఎదురైంది. చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరడానికి బ్రేక్ పడింది.
Chikoti Praveen Likely To Join BJP:
హైదరాబాద్: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ పాలిటికల్ ఎంట్రీపై ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ నేతలతో సైతం భేటీ అయి చర్చలు జరిపారు. నేడు చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరాల్సి ఉండగా.. చివరి నిమిషంలో క్యాసినో కింగ్ కు నిరాశే ఎదురైంది. చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరడానికి బ్రేక్ పడింది. భారీ ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చికోటి ప్రవీణ్ చేరుకున్నారు. కానీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరికకు తాత్కాలికంగా వాయిదా పడింది. పార్టీ ఆఫీసులో నేతలతో చర్చలు జరుపుగుతున్నట్లు తెలుస్తోంది.
కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్ టెంపుల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి బీజేపీ ఆఫీసుకు చేరుకుని పార్టీలో చేరాల్సి ఉంది. అయితే మరికాసేపట్లో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో చికోటి ప్రవీణ్ పార్టీలో చేరతారనగా.. ఢిల్లీ అధిష్టానం నుంచి తెలంగాణలో పార్టీ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. చికోటి ప్రవీణ్ పార్టీలో చేరికను తాత్కాలికంగా వాయిదా వేయాలని, ప్రస్తుతం ఎలాంటి చేరిక లేదని రాష్ట్ర అధిష్టానానికి సూచించారు.
చికోటి ప్రవీణ్ గత నెలలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతల్ని కలిశారు. బండి సంజయ్, డీకే అరుణను కలిసి శాలువా కప్పి సత్కరించారు. వీరితో పాటు రాంచందర్ రావును కూడా కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వారికి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిల నుంచి ఏదో ఓ అసెంబ్లీ వస్తుందని, పోటీ చేస్తానని చికోటి భావించారు. ఇవన్నీ గమనిస్తే రేపో, మాపో చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చికోటి ప్రవీణ్ ను పార్టీలో చేరే వరకు ఏం జరుగుతుందోనని అంతా భావించారు. ఊహించినట్లుగానే చివరి నిమిషంలో బీజేపీలో చికోటి చేరికకు బ్రేక్ పడింది.
సైదాబాద్ వినయ్ నగర్ కాలనీ లో నివాసం ఉండే చికోటి ప్రవీణ్.. మొదట రేషన్ షాపు నిర్వహించడంతో కెరీర్ మొదలుపెట్టి.. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. ఆ తర్వాత క్యాసినోలు నిర్వహించడం, రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని ఫార్మ్ హౌస్ లో ప్రముఖులతో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత కేసినో మీద దృష్టి పెట్టారు. పలు స్టార్ హోటళ్లలో రహస్యంగా కేసినోలు నిర్వహించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి.
భారత్ లోనే కాదు విదేశాల్లోనూ చికోటి ప్రవీణ్ క్యాసినో కంపెనీలతో సంబంధాలు పెట్టుకున్నారు. భారత్ లో గోవా, విదేశాలు నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బ్యాంకాక్ లలో క్యాసినో నిర్వహించేవారని తెలుస్తోంది. గోవాలోని "బిగ్ డ్యాడీ" క్యాసినోలో చీకోటి పార్టనర్ అనే ప్రచారం ఉంది. "బిగ్ డ్యాడీ" క్యాసినో గోవాలో ఫేమస్.