Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై పోలీస్ కేసు... రెండు నెలల తర్వాత 'రెట్రో'ను తవ్వి తీసి!
Vijay Deverakonda Case: యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ మీద హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే...

తమిళ కథానాయకుడు సూర్య నటించిన 'రెట్రో' విడుదలై 50 రోజులు దాటింది. హైదరాబాద్ సిటీలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ఇప్పుడు ఆ వేడుకలో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ మీద కేసు నమోదు అయ్యింది.
గిరిజనులను అవమానిపరిచిన హీరో!?
'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనులు అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ హైదరాబాద్ సిటీలోని మాదాపూర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హీరో మీద చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్ ఏసిపి శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: సిస్టర్ సిస్టర్ అంటూ హీరో ఛాన్స్ కొట్టేశాడు... 'ప్రేమలు' అమల్ డేవిస్‌తో మమిత సినిమా
విజయ్ దేవరకొండ ఏం మాట్లాడారు?
ఆ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడడానికి ముందు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఎటాక్ జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులను ఉద్దేశిస్తూ ఆయన ట్రైబల్స్ అనే పదం వాడారు. అయితే విజయ్ దేవరకొండ షెడ్యూల్డ్ ట్రైబల్స్‌ను అవమానపరిచారని విమర్శలు వ్యక్తం అయ్యాయి వాటిపై విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు. గిరిజనులను అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ట్రైబల్స్ అనే పదాన్ని వేరే అర్థంలో వాడానని వివరించారు. అప్పట్లో సమసిపోయిన వివాదం మళ్లీ మరోసారి కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది.
Also Read: తమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే... మనకు ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు!





















