Telangana High Court: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే
Telangana: తెలంగాణలో ఉపఎన్నికలు రాబోతున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ విధానం తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఈ తీర్పును స్పీకర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
![Telangana High Court: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే BRS welcomes Telangana High Court verdict on MLAs disqualification petitions Telangana High Court: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/09/7cf0ffb7fc2ecfbc02c1153fdec8d90f1725865041346215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS Comments On High Court Verdict : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పును బీఆర్‌ఎస్ స్వాగతించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే..." ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు." కాంగ్రెస్ పార్టీ విధానాలను దుయ్యబట్టారు.
ఈ తీర్పుతో తెలంగాణలో ఉపఎన్నికలు రాబోతున్నాయని అన్నారు హరీష్. ఆ ఎలక్షన్స్‌లో కచ్చితంగా బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. "తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం. తెలంగాణ హైకోర్డు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం తథ్యం. అనర్హత కారణంగా ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ గెలుపు తథ్యం.
ఎమ్మెల్యేల అనర్హత ఫిటీషన్ల పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2024
ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు.
తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం…
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను గౌరవించి నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు"హైకోర్డు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం." అని అభిప్రాయపడ్డారు.
Also Read: అనర్హత పిటిషన్లపై నెల రోజుల్లో తేల్చండి - తెలంగాణ స్పీకర్‌కు హైకోరు ఆదేశం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)