అన్వేషించండి

BRS Meetings: నేటి నుంచి బీఆర్‌ఎస్‌ వరుస సమావేశాలు-లోక్‌సభ ఎన్నికలకు వ్యూహరచన

BRS Politics : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. నేటి నుంచి 21వ తేదీ వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. రెండు విడతల్లో జరగనున్న ఈ సమావేశాలు ఇవాళ ఆదిలాబాద్‌తో ప్రారంభకానున్నాయి.

BRS Meetings: అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చవిచూసిన గులాబీ పార్టీ... పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. అత్యధిక ఎంపీ స్థానాలను కైవశం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా... వరుస సమావేశాలు నిర్వహిస్తూ... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా... నేటి  నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ. ఈ సమావేశాలు ఈనెల 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం (Adilabad Lok Sabha Constituency) పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పా టు చేశారు.

ఇవాళ ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఉదయం 10:30 గంటలకు కేటీఆర్‌ (KTR) అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ గోడెం నగేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు అనిల్‌ జాధవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజక వర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు సుమారు 500 మంది ముఖ్యనేతలు పాల్గొంటారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 

లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల బాధ్యతను సీనియర్‌ నేతలకు అప్పగించారు బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు (కేటీఆర్‌), పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావుతోపాటు హరీశ్‌రావు (Harish Rao), కడియం శ్రీహరి (Kadiam Srihari), జగదీశ్‌రెడ్డి (Jagdish Reddy), వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ కావడంతో... మూడు రోజులు బ్రేక్‌ ఇచ్చి... జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. 

బీఆర్‌ఎస్‌ సమావేశం తేదీలు..
ఇవాళ (జనవరి 3వ తేదీ) ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం జరగనుండగా... రేపు (జనవరి 4వ తేదీ) కరీంనగర్‌, 5వ తేదీన చేవెళ్ల, 6వ తేదీన పెద్దపల్లి, 7వ  తేదీన నిజామాబాద్‌, 8వ తేదీన జహీరాబాద్‌, 9వ తేదీన ఖమ్మం, 10వ తేదీన వరంగల్‌, 11వ తేదీన మహబూబాబాద్‌, 12వ తేదీన భువనగిరి, 16న నల్లగొండ, 17న  నాగర్‌కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మలాజిగిరి, 21న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లో సమావేశాలు జరగనున్నాయి. 

ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గంలో సమావేశం నిర్వహిస్తారు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు. ఆ నియోజకవర్గ పరిధిలోని నాయకులతో సమావేశమవుతారు. పార్లమెంట్‌  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. సమావేశానికి హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని... తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు. ముఖ్యంగా...  అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది బీఆర్‌ఎస్‌.

ఇక... ఈ సమావేశాలకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించింది బీఆర్‌ఎస్‌. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు,  నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరుకానున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget