News
News
X

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నేడు ఢిల్లీలో కవిత దీక్ష- మద్దతుగా నిలవనున్న వివిధ పార్టీలు

భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఉదయం పది గంటలకు దీక్షను ప్రారంభించనున్నారు.

FOLLOW US: 
Share:

పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం దీక్షకు కూర్చోనున్నారు. ఒక్కరోజు దీక్షకు వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు కవిత దీక్షకు మద్దతు తెలపనున్నాయి. 

భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఉదయం పది గంటలకు దీక్షను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షలో కవిత కూర్చుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సీపీఐ కార్యదర్శి డీ రాజా వచ్చి దీక్షను విరమింపజేస్తారు. 

కవితతోపాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, భారత జాగృతి సమితి సభ్యులు దీక్షలో పాల్గొంటారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు వచ్చి ఆమెకు సంఘీభావం తెలపనున్నారు. ఇప్పటికే కవిత దీక్షకు సుమారు 30 పార్టీల వరకు మద్దతు తెలిపాయి. వీరితోపాటు మహిళా హక్కుల సంఘాలు, మహిళా స్వచ్ఛంద సంస్థలు, పార్టీల లీడర్లు వచ్చి సంఘీభావం ప్రకటించనున్నారు. 

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కవిత తలపెట్టిన పై గురువారం సాయంత్రం వరకు సస్పెన్స్‌ నెలకొంది. కవిత దీక్ష టైంలోనే బీజేపీ కూడా ధర్నా చేస్తామని చెప్పడంతో అసలు ఎవరి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇస్తారనే టెన్షన్ క్రియేట్ అయింది. చివరకు జంతర్‌మంతర్‌ నుంచి ధర్నా వేదికను దీన్‌దయాల్‌ మార్గ్‌కు బీజేపీ మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా చేయాలనుకుంది.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కవిత దీక్ష చేయాలని ముందుగా పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే ఉదయం జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని లేకుంటే.. వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచిస్తూ.. సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్న కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని ఆంక్షలు విధించారు. మొత్తం స్థలం ఇవ్వలేం అని.. గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసి.. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ షరతుల క్రమంలోనే.. దీక్ష ప్రదేశాన్ని పరిశీలించారు కవిత. చివరికి పోలీసులతో జరిగిన చర్చల తర్వాత బీజేపీ తన ధర్నా స్థలాన్ని మార్చుకోవడతో సమస్య పరిష్కారం అయింది.

ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర దీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు కవిత. దేశవ్యాప్తంగా ఉన్న 29 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నట్లు ప్రకటించారు.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని భారత్‌ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.   27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసమే జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నామని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్‌ స్టోరేజీలో పెట్టింది. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2న పోస్టర్‌ రిలీజ్‌ చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు ముందుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. 

సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే దేశం ఎలా విశ్వగురు అవుతుందని ప్రశ్నించారు. లోక్‌సభలో బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, ఆ పార్టీ తలచుకొంటే ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకొని బిల్లు తేవచ్చని చెప్పారు. : దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు.  పార్లమెంట్‌లో 14.4 శాతం మాత్రమే మహిళా ప్రతినిధులు ఉన్నారన్న కవిత.. పక్కనున్న పాకిస్థాన్‌లో 17 శాతం ఉన్నారని..  మహిళా రిజర్వేషన్లే సమస్యకు పరిష్కారమంటున్నారు. దాదాపుగా ఐదు వేల మంది ఈ మహిలా రిజర్వేషన్ల నిరసన దీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. 

Published at : 10 Mar 2023 07:48 AM (IST) Tags: Telangana Politics women's reservation Kavita Deeksha at Jantar Mantar

సంబంధిత కథనాలు

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్

హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్

Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్

Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్

టాప్ స్టోరీస్

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్