అన్వేషించండి

Harish Rao: మెడికల్ అడ్మిషన్ల విషయంలో కొత్త జీవోతో డేంజర్ - హరీష్ రావు వార్నింగ్

Telangana Latest News: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోతో మన తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు.

Harish Rao Comments on Congress Government: గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందని.. ఏ అంశంలోనూ ప్రభుత్వానికి ఒక స్పష్టత గానీ, ప్రణాళిక గానీ, పద్ధతి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో 33 తో మన తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆలోచన లేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు.
 
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ కొత్తగా ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని హరీశ్ రావు అన్నారు. మన తెలంగాణ బిడ్డలే మనకు స్థానికేతరులుగా అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.

ప్రభుత్వం వైఫల్యం వల్ల మన విద్యార్థులు నష్ట పోతున్నారని అన్నారు. విధానాలు అర్థం కాకపోతే అఖిలపక్షం పిలవాలని చెప్పారు. మన విద్యార్థులకు మన రాష్ట్రంలో సీట్లు వచ్చే విధంగా చేయాలని కోరారు. 9,10, 11,12 తరగతులు తెలంగాణలో చదివితే ఇక్కడ లోకల్ అవుతారని.. అదే కర్ణాటకలో మెడిసిన్ చదివి వచ్చిన మన విద్యార్థులు ఇక్కడ పీజీ చదవాలి అంటే నాన్ లోకల్ అవుతారని చెప్పారు. 

అదీ కేసీఆర్ సాధించిన ఘనత
అంతేకాక, రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల విషయంలో 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఓ జీవో తెచ్చిందని, ఫలితంగా 95 శాతం ఉద్యోగాలు ఆ జిల్లాకు చెందిన స్థానికులకే వచ్చేలా కేసీఆర్ చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. అంతకుముందు 60:40 లేదా 70:30 నిష్పత్తిలో ఉద్యోగ నియామకాలు చేసేవారని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి మరీ తెలంగాణలో స్థానికులకు పెద్ద పీట వేసేలా కేసీఆర్ మార్పు తెచ్చారని గుర్తు చేశారు. దీని వ‌ల్ల తెలంగాణలో ఉద్యోగ నియామ‌కాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా రిజ‌ర్వేష‌న్లు తేగలిగామని అన్నారు. గ‌తంలో 40 శాతం మంది ప‌క్క రాష్ట్రం నుంచి వ‌చ్చి ఓపెన్ కోటాలో ఉద్యోగాలు పొందేవారని గుర్తు చేశారు. కేసీఆర్ రాష్ట్రప‌తిని, ప్రధానిని క‌లిసి 95 శాతం ఉద్యోగాలు తెలంగాణలోని యువతకే వచ్చేలా స‌వ‌ర‌ణ‌లు చేశారని హ‌రీశ్‌రావు చెప్పారు.

8 పైసలు కూడా ఇవ్వలేదు
అంతా గందరగోళం, ఆగమ్యగోచరంగా  'స్వచ్ఛదనం - పచ్చదనం' కార్యక్రమం ఉందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వలేదని విమర్శించారు. ఆఖరికి గ్రామ పంచాయతీలల్లో డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికి అయినా వెళ్లి చూసినా అదే పరిస్థితి కనిపిస్తోందని.. ఆలోచన లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమం మొదలు పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 8 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి దాకా పంచాయతీలకు 8 పైసలు కూడా ఇవ్వలేదని హరీశ్ రావు విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget