kalvakuntla Kavitha: తిహార్ జైలులో కవితతో సమావేశమైన బీఆర్‌ఎస్ లీడర్లు
Kalvakuntla Kavitha: తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్ లీడర్లు సమావేశమయ్యారు. దీనిపై కాసేపట్లో బాల్క సుమన్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.
Telangana News: లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్ లీడర్లు ములాఖత్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ పది గంటలకు తీహార్ జైలుకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు. ఆమె ఏమంటున్నారు అనే వివరాలను మధ్యాహ్నం మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
జైలు కవితతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్..." కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులని లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిరంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం అవుతుంది. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు." అని అన్నారు.
పేర్లు చెప్పాలని ఒత్తిడి
కవిత దగ్గర నుంచి ఒక్క రూపాయి డబ్బు దొరక్కుండా పీఎంఎల్‌ఏ ఎలా వర్తిస్తుందని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవని... అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. వాళ్ళ పేర్లు, వీళ్లా పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటుంది.
బాల్క సుమన్ మాట్లాడుతూ... "కవిత మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు. న్యాయస్థానలపై నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు. బీజేపీకి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు కేసే కాదు, అదొక పాలసీ... దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో బిఅరెస్, ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసే కుట్ర. లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి లాభమే జరిగింది. బీజేపీ వంటకాన్ని వండి....సీబీఐ, ఈడీని ఆప్, బిఅరెస్ మీదకి వదిలింది. ఇలాంటి కేసులతో మమ్మల్ని భయబ్రాంతులకు గురి అవుతామనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారు, కానీ భయపడే ప్రసక్తే లేదు. దేశంలో పాసిస్ట్ పాలన నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. బీజేపీ 220 సీట్లు దాటదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. ప్రతిపక్షాల నేతలను జైల్లో పెట్టి ప్రజాతీర్పును వారికి అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలకు ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పనున్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టిన తలవంచకుండా పోరాటం చేస్తాం. మొండిగానే పోరాడుతామని కవిత చెప్పారు.