Bandi Sanjay: వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ కార్యకర్త అరెస్ట్ - కేవలం తమపైనే కేసులెందుకని ప్రశ్నించిన బండి సంజయ్
Bandi Sanjay: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త పరంధాంను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాకు చెందిన పరందాం అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త. అతడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పరందాం గతంలో తెలంగాణ సెక్రటేరియట్ లో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ ట్వీట్ లకు వివాదాస్పద రిప్లైలు ఇచ్చారు. ప్రస్తుతం.. హైదరాబాదులోని ముస్లింల ఇండ్లని ఇతర మతస్తులకి రెంటుకు ఇవ్వడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో మత కల్లోలాలను రెచ్చగొడుతున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు పరందాంని అరెస్ట్ చేశారు. 41 ఏసీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చి అరెస్టు చేసినట్టుగా సైబర్ క్రైమ్ ఏసీపీ వెల్లడించారు.
Hindutva atmosphere is sending chills down spine of BRS ! They're trying to intimidate us with police cases. Parandham, @BJP4Telangana social media activist was arrested by police. We demand his immediate release. Those who fight for Hindu dharma are termed as communal in TS.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023
బీజేపీ కార్యకర్త పరందాం అరెస్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని.. ఈ క్రమంలోనే పరందాంను కూడా అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు. కావాలనే అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. వెంటనే పరందాం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Why shouldn't I speak about Hindu Dharma ? I will speak about my religion. We need to fight for protecting Hinduism & work for establishing Rama Rajya with passion, commitment & honesty.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023
Else people can't survive & women will be left unprotected in kingdom of Razakars.
బీజేపీ కార్యకర్త విడుదల
బీజేపీ కార్యకర్త విడుదల బీజేపీ కార్యకర్త పరందాంను సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చిన నోటీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. అనంతరం పరందాంను విడుదల చేసినట్లు వెల్లడించారు. అయితే కేవలం బీజేపీ కార్యకర్తలను, హిందూ మతం కోసం పోరాడుతున్న వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని, తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడులు చేసిన బీఆర్ఎస్ శ్రేణులపై మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు బండి సంజయ్.
Police ignore those who insult #Hinduism but will arrest those who work for protecting it. War has started. We will go to any extent to protect our BJP Karyakartas and social media activists. We're ready to head to DGP Office or Pragathi Bhavan if necessary.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023
Jai Sri Ram !